Penguins : మనిషి చేస్తున్న కొన్ని తప్పిదాల వల్ల వాతావరణం ఎంతగా కాలుష్యం అవుతుందో కొన్ని ప్రమాద హెచ్చరికలు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే అంటార్కిటికా ఖండంలో మంచు పర్వతాల్లో ఉండే పెంగ్విన్లు ఆ సూచికను మనకు అందజేశాయి. మంచు ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మంచు ప్రాంతాలు కరగడం వల్ల ఆ ప్రాంతాల్లో అధిక వేడి ఉష్ణోగ్రతలు ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో మంచు కొండల్లో దాదాపు పదివేల పెంగ్విన్లు మరణించాయనే వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది.
వాటి మరణానికి వాతావరణ సమస్యలే కారణమని, ఇక రాబోయే రోజులలో మనిషి మనుగడ భూమిపైన ప్రశ్నార్థకమే అని తెలుస్తుంది. గ్లోబల్ వార్మింగ్ లో భాగంగా మంచు పర్వత ప్రాంతాల్లో అత్యధిక వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆలాంటి వేడి ప్రాంతాల్లో చల్లటి ఉష్ణోగ్రతలు రావడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇండియాలో భిన్నమైన వాతావరణం, అత్యంత వేడి ప్రాంతాలు, సమశీతోష్ణ ప్రాంతాలు, చల్లటి ప్రదేశాలు ఇలా అన్ని మిలితామై ఉంటాయి.
అయితే ఎక్కడ ఏ విధంగా ఉండాలో అలా ఉండకుండా వివిధ రకాల వాతావరణాల కారణంగానే పెంగ్విన్ లు చనిపోయినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే భవిష్యత్తు రోజులలో పెంగ్విన్ల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి 10000 పెంగ్విన్ లు మరణించడం వెనక ఎంతో బలమైన కారణం ఉండి ఉండాలి. లేదా బలమైన వ్యాధి అయినా రావచ్చు.
లేదంటే ఒకేసారి మూకుమ్మడిగా ఇలా మరణించడం సాధ్యం కాదు. ఇది జీవవైవిద్యాన్ని పరిరక్షించే శాస్త్రవేత్తలు గమనించాల్సిన విషయం. వాతావరణంలో మార్పులు ఎలా తీసుకురావాలి. రాబోయే తరాలను ఎలా కాపాడుకోవాలని వారు ఆలోచించాలి. మార్పు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతకవలసి ఉంటుంది. లేకపోతే ఇది మనిషి మనుగడకే చాలా ప్రమాదం. పర్యావరణాన్ని రక్షిస్తేనే రేపటి భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించగలుగుతాయి.