Politics of Janasena and TeluguDesam : రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకొని కలసి పోటీ చేయబోతున్నాయన్న విషయం విధితమే. అయితే తెలుగుదేశం, జనసేన రాబోయే జనరల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే మాత్రం 15 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంటు సీట్లు తెలుగుదేశం, జనసేన కూటమికి దక్కే అవకాశం ఉంది.
దీన్ని బట్టి చూస్తే ఒక నియోజకవర్గంలో కూడా వై.ఎస్.ఆర్.సి.పి గెలిచే అవకాశం ఎక్కడ కూడా కనబడడం లేదు. ఈ 15 సీట్లలో 13 సీట్లు జనసేనకు మరియు రెండు సీట్లు తెలుగుదేశం గెలుచుకున్నట్లైతే.. వైసీపీ పరిస్థితి అగమ్య గోచరమే అని చెప్పవచ్చు. జనసేన, తెలుగుదేశం విజయం సాధించి అన్ని సీట్లు గెలుస్తాయి అని చెప్పడానికి అనుకూల పరిస్థితులు చాలా కనపడుతున్నాయి.
జనసేన 13 సీట్లు దక్కించుకుంటుంది అని చెప్పడానికి ముఖ్య కారణాలు లేకపోలేదు. జనసేనను సపోర్ట్ చేసే కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉండడం, అదేవిధంగా జనసేనను బలపరిచే బీసీ ,ఎస్సీ సామాజిక వర్గంతో పాటు, జనసేనకు బలమైన అభ్యర్థులు ఉండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యల పైన సరిగా స్పందించకపోవడం, సమస్యలను చూసి చూడనట్టు వదిలేయడం.
ప్రజా ప్రతినిధులపై అవినీతి ఆరోపణలు ఉండడం కూడా జనసేన విజయాలకు కారణంగా చెప్పుకోవచ్చు. జనసేనకు ఓటర్ల సంఖ్యాబలంతో పాటు బలమైన అభ్యర్థులు ఉన్న నియోజక వర్గాలు నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, ఆచంట, ఏలూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు.
అలాగే తెలుగుదేశానికి పాలకొల్లు, దెందులూరుగా చెప్పుకోవచ్చు. పార్లమెంటు నియోజక వర్గాలు నర్సాపురం, రాజమండ్రి జనసేనకు, ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశానికి బలమైన నియోజకవర్గాలుగా చెప్పుకోవచ్చు.