Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వరుస ఫ్లాప్ లు వచ్చినప్పటికీ డార్లింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ ఆయా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా,
సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించగా.. టీ సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. అయితే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ని మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. నెక్స్ట్ సలార్, ప్రాజెక్ట్ K తో అయిన ప్రభాస్ కమ్ బ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరికొత్త రికార్డ్ ఫ్యాన్స్ కి ఊరటనిస్తుందని చెప్పవచ్చు.
ఆదిపురుష్ మొదటి రోజే 140 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి-2 తొలిరోజే రూ.122 కోట్లు, సాహో రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తొలిరోజే 3 సినిమాలు రూ. 100 కోట్లపైన కలెక్షన్లు సాధించిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డ్ సృష్టించాడు. ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ సలార్, ప్రాజెక్ట్ K కూడా ఫస్ట్ డే 100కోట్ల కలెక్షన్స్ సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.