Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అమ్మాయిల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. బాహుబలి2 తో డార్లింగ్ క్రేజ్ ఖండాంతరాలకు రీచ్ అయ్యింది. ఇటీవల వరుస ఫ్లాప్ లు వచ్చినప్పటికీ డార్లింగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రెస్రెంట్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆదిపురుష్.
ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున, 70 దేశాల్లో ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేశారు. టీజర్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని, ట్రయిలర్ ను జాగ్రత్తగా కట్ చేసినట్టు కనిపిస్తోంది. టీజర్ తో పోలిస్తే, ట్రయిలర్ లో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ట్రీట్ ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయింది.
తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ కూడా సెన్సేషనల్ క్రీయేట్ చేసింది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసింది. అయితే ఇంట్రెస్టింగ్ గా గ్లోబల్ వైడ్ గా వరుసగా 4 సినిమాలకు వరుసగా 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ట్రైలర్స్ ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. దీనితో ఈ రేర్ రికార్డు సొంతం చేసుకున్న ఏకైక హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతి మూవీ ట్రైలర్ 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీస్ కి కూడా ఈ సెన్సేషన్ కంటిన్యూ అవ్వడం ఖాయం.