Spirit Movie: 100 రోజుల్లోనే ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా పూర్తి.. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రెబల్ స్టార్ కొత్త లుక్
Spirit Movie: ప్రస్తుతం ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, త్వరలోనే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సెట్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఈ సినిమాపై సినీ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉండగా, తాజాగా దీనికి సంబంధించిన మేకింగ్ స్ట్రాటజీ సినీ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలను అందించిన సందీప్ రెడ్డి వంగా.. పూర్తి స్క్రిప్ట్‌తో, పక్కా ప్రణాళికతో మాత్రమే షూటింగ్‌ను ప్రారంభిస్తారు. ఆయన స్టైల్‌కు తగ్గట్టుగానే ‘స్పిరిట్’ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం బౌండ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న దర్శకుడు.. కీలక సన్నివేశాల కోసం సెట్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించారట. అంతేకాకుండా, హర్షవర్ధన్ రామేశ్వర్ నేతృత్వంలో సంగీత సిట్టింగ్స్‌ను కూడా పూర్తి చేశారు.
సందీప్ రెడ్డి వంగా ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఒక్కసారి షూటింగ్ మొదలయ్యాక కేవలం వంద రోజుల్లోనే చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ‘యానిమల్’ చిత్రాన్ని కూడా ఆయన ఇదే విధంగా వంద రోజుల్లోనే పూర్తి చేశారట. అదే వేగవంతమైన, పక్కా ప్రణాళికతో కూడిన విధానాన్ని ‘స్పిరిట్’ విషయంలోనూ అమలు చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నది.
ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం ప్రభాస్ ఒక సరికొత్త గెటప్‌ను ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లలో ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉండేలా వంగా ప్లాన్ చేశారట. ప్రభాస్ కొత్త లుక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటించనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో దక్షిణాదికి చెందిన కొందరు అగ్ర నటులు కూడా కీలక పాత్రలు పోషించనున్నారని తెలిసింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందిస్తున్నారు. సందీప్-ప్రభాస్ కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో నిలబెట్టింది.
