Prajagalam Pawan Speech : ప్రజాగళం సభలో దేవదత్తం, పాంచజన్యం అంటూ గూస్ బంప్స్ తెప్పించిన జనసేనాని.. పురాణాలపై లోతైన అవగాహన
ఏపీలో ఎన్డీయే పొత్తు కుదిరాక ప్రధాన మంత్రి సమక్షంలో చిలకలూరి పేటలో నిర్వహించిన ప్రజాగళం సభ సూపర్ సక్సెస్ అయింది. ఎన్నికల మహాసంగ్రామం ముందు జనసేనాని పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ, టిడిపి అధినేత చంద్రబాబు త్రిమూర్తులుగా బలమైన సందేశం పంపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగం అందరిని విపరీతంగా ఆకట్టుకుంది.
పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఎక్కువగా పురాణాల ప్రస్తావన తీసుకువచ్చారు. ఏపీలో సమస్యలని, అధికార పార్టీ అవినీతిని, మోడీ రాకని పురాణాలతో అన్వయిస్తూ పవన్ కళ్యాణ్ వివరించిన విధానం అదుర్స్ అనే చెప్పాలి. పితృదేవతలు మోక్షం లేక తల్లడిల్లుతున్న సమయంలో దివినుంచి గంగమ్మ తల్లి దిగివచ్చి వాళ్ళని పునీతులని చేసింది. అదే విధంగా వైసిపి పాలనలో కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకి మోడీ రాక సేదని చేకూర్చే అంశం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారితో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు సంభాషణ. ఎన్నికల సన్నద్దత, రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడారు#PrajaGalam#BJP #JSP #TDP pic.twitter.com/0s7i2PWBFQ
— JanaSena Party (@JanaSenaParty) March 17, 2024
పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా మధ్యలో మోడీ అడ్డుకున్న విధానం వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువుని తెలియజేసే విధంగా ఉంది. పవన్ ప్రసంగిస్తుండగా కొందరు యువకులు లైటింగ్ టవర్ ఎక్కేసారు. అది గమనించిన మోడీ.. పవన్ అంటూ మైక్ దగ్గరకి వెళ్లారు. మోడీ పిలిచిన ఆ పిలుపు పవన్ తో ఉన్న చనువుని సూచిస్తుంది అని అంటున్నారు. లైటింగ్ టవర్ ఎక్కిన యువకుల్ని హెచ్చరించిన తర్వాత పవన్ తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు.
చివర్లో పవన్ కళ్యాణ్ మోడీ కి ఇచ్చిన ఎలివేషన్ అదిరింది. తద్వార తనని తాను అర్జునుడిగా చెప్పుకుంటూ మోడీ శిష్యుడిని అని చెప్పకనే చెప్పారు. తాను తాడేపల్లి గూడెం సభలో దేవదత్తం పూరించినట్లు పవన్ తెలిపారు. ఎన్నికల సంగ్రామాన్ని పవన్ కురుక్షేత్రంగా అభివర్ణించారు. మహాభారతం కురుక్షేత్రంలో దేవదత్తం పూరించింది అర్జునుడు. ఇక ప్రధాని మోడీ గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన కృష్ణుడిగా అభివర్ణిస్తూ.. ఆయన పాంచజన్యం పూరించబోతున్నారు అని పవన్ తెలిపారు. తద్వారా పవన్.. నరేంద్ర మోడీ తాను కృష్ణార్జునులం అని చెప్పకనే చెప్పారు.
పురాణాలపై లోతైన అవగాహనతో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం గూస్ బంప్స్ తెప్పించింది. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మందే విజయం..పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం అని చెప్పిన పంక్తులు హైలైట్ అయ్యాయి.