రాధికా ఆప్టే ఎంతటి బోల్డ్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె గ్లామర్ కోసం న్యూడ్ గా అయినా నటించగలదు.. అదే విధంగా మనసులో భావాలని అంతే ధైర్యంగా చెప్పగలదు. రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. లయన్ మూవీలో కూడా మెరిసింది.
కానీ టాలీవుడ్ పట్ల రాధికా ఆప్టేకి కొంచెం కూడా సానుకూల అభిప్రాయం లేదు. టాలీవుడ్ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా చిర్రుబుర్రులాడుతూ ఉంటుంది. గతంలో రాధికా ఆప్టే బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మరోసారి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ ప్రస్తావన రాగానే.. తెలుగు చిత్ర పరిశ్రమలో నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నా. అక్కడ హీరోయిన్లని చూసే విధానం వేరుగా ఉంటుంది. అక్కడ మహిళకు పెద్దగా ప్రాధ్యాన్యత ఇవ్వరు. అంతా పురుషాధిక్యమే కనిపిస్తుంది. హీరోయిన్లకి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండానే ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్స్ రద్దు చేస్తారు.
ఆ విధంగా తాను చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు రాధికా ఆప్టే పేర్కొంది. మహిళల అవససరం వాళ్ళకి పరిమితంగానే ఉంటుంది. అందుకే టాలీవుడ్ లో నా కెరీర్ ముగిసింది అని రాధికా ఆప్టే అన్నారు. ఎప్పుడు మాట్లాడినా టాలీవుడ్ పై రాధికా ఆప్టే కసితో మాట్లాడుతోంది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.