• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Raghava Lawrence: రియల్ హీరో లారెన్స్‌ గొప్ప మనసు.. తన సొంతింటిని ఉచిత పాఠశాలగా మార్చి..

Raghava Lawrence: రియల్ హీరో లారెన్స్‌ గొప్ప మనసు.. తన సొంతింటిని ఉచిత పాఠశాలగా మార్చి..

Sandhya by Sandhya
September 12, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Raghava Lawrence: రియల్ హీరో లారెన్స్‌ గొప్ప మనసు.. తన సొంతింటిని ఉచిత పాఠశాలగా మార్చి..
Spread the love

Raghava Lawrence: రియల్ హీరో లారెన్స్‌ గొప్ప మనసు.. తన సొంతింటిని ఉచిత పాఠశాలగా మార్చి..

 

Raghava Lawrence: ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నారు. “రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్” ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న లారెన్స్, ఇప్పుడు తన మొదటి ఇంటిని పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు పాఠశాలగా మార్చనున్నారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని తాను ప్రస్తుతం నటిస్తున్న ‘కాంచన 4’ సినిమా అడ్వాన్స్‌తో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

“నేను నా సినిమాలకు తీసుకునే అడ్వాన్స్‌ను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాననే విషయం మీలో చాలామందికి తెలుసు. ఈసారి నేను నిర్మించుకున్న తొలి ఇంటిని విద్యార్థుల కోసం పాఠశాలగా మారుస్తున్నానని తెలియజేయడానికి సంతోషంగా ఉంది” అని లారెన్స్ పేర్కొన్నారు. డ్యాన్స్ మాస్టర్‌గా తాను సంపాదించిన మొదటి డబ్బుతో కట్టుకున్న ఇల్లు కాబట్టి ఇది తనకు చాలా ప్రత్యేకమైనదని ఆయన తెలిపారు.

గతంలో ఈ ఇంటిని అనాథాశ్రమంగా మార్చి, తన కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. అక్కడ పెరిగిన పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారని, తన ఇంటిని మళ్లీ ఒక మంచి సేవకు వినియోగిస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. అంతేకాకుండా, ఆ స్కూల్‌లో మొదటి టీచర్‌గా తన ఇంట్లో పెరిగిన పిల్లల్లో ఒకరే పనిచేయనున్నారని చెప్పి మరింత సంతోషం వ్యక్తం చేశారు.

లారెన్స్ చేసిన మరో పోస్ట్‌లో, రైళ్లలో తినుబండారాలు అమ్ముతూ జీవిస్తున్న 80 ఏళ్ల వృద్ధుడికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆ వ్యక్తి వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఒకవేళ ఎవరైనా ఆ వ్యక్తిని చూస్తే, వారి దగ్గర తినుబండారాలు కొని ప్రోత్సహించాలని లారెన్స్ కోరారు. లారెన్స్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఆయనకు ప్రజల నుంచి మరింత ప్రశంసలు తెచ్చిపెట్టాయి.


Spread the love
Tags: Free EducationKanchana 4 UpdateLawrence Charitable TrustRaghava Lawrence HelpRaghava Lawrence New MovieRaghava Lawrence Sevaఉచిత విద్యకాంచన 4 అప్డేట్రాఘవ లారెన్స్ కొత్త సినిమారాఘవ లారెన్స్ సహాయంరాఘవ లారెన్స్ సేవాలారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.