Rahul Sipligunj: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసేసుకున్న రాహుల్ సిప్లిగంజ్..!
Rahul Sipligunj: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా, ‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. తన ప్రియురాలు హరిణి రెడ్డితో రాహుల్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకను చాలా ప్రైవేట్‌గా నిర్వహించినప్పటికీ, వారికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడటంతో ఈ శుభవార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
రాహుల్ సిప్లిగంజ్, హరిణి రెడ్డి తమ నిశ్చితార్థ వేడుకలోమెరిసిపోయారు. రాహుల్ లేత లావెండర్ రంగు షేర్వానీలో రాజసం ఉట్టిపడేలా కనిపించగా, హరిణి నారింజ రంగు లెహెంగా ధరించి ఆకర్షణీయంగా కనిపించారు. ఈ జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు, అభిమానులు వారిని అభినందిస్తున్నారు. పెళ్లి తేదీ గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. హరిణి రెడ్డి వివరాలు ఇంకా పూర్తిగా తెలియకపోయినప్పటికీ, ఆమె కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అని భావిస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్‌గా ఉన్నప్పటికీ, ఆమెకు 15 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. యాంకర్ విష్ణుప్రియ, సింగర్ నోయల్, స్రవంతి చొక్కారపు, గీతా మాధురి, అరియానా, సన్నీ వంటి పలువురు సెలబ్రిటీలు హరిణిని ఫాలో అవుతుండటం విశేషం.
గతంలో రాహుల్ సిప్లిగంజ్, నటి అషు రెడ్డితో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు హరిణి రెడ్డితో నిశ్చితార్థం చేసుకుని ఆ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టారు. ఈ గుడ్‌న్యూస్‌తో రాహుల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సింగర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న రాహుల్, ‘మఠిపాలే’, ‘బోనాలే’, ‘పెదవలే పడితేనా’, ‘నాటు నాటు’ వంటి ఎన్నో హిట్ పాటలతో యువతను అలరిస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషకరమైన వార్తను పంచుకుని అభిమానులను ఆనందపరిచారు.
