రకుల్ పెళ్లి కోసం 246 గదుల లగ్జరీ రిసార్ట్.. ఒక్క రూమ్ కి అద్దె ఎంతో తెలుసా, మ్యారేజ్ బడ్జెట్ ఊహకి కూడా అందదు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లు రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తక్కువ ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. టాలీవుడ్ లో అయితే ఆమె హవా పూర్తిగా తగ్గిపోయింది. టాలీవుడ్ లో రకుల్.. మహేష్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఆమెకి దక్కిన హిట్స్ మాత్రం తక్కువ.
బాలీవుడ్ లో కూడా రకుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ రకుల్ కి కలసి రాలేదు. వెండితెరపై రకుల్ ప్రీత్ సింగ్ అవసరమైన మేరకు అందాలన్నీ ఒలకబోసింది. యువత కి ఫేవరిట్ హీరోయిన్ గా మారింది. అయితే అదంతా గతం. సోషల్ మీడియాలో మాత్రం రకుల్ గ్లామర్ షోకి ఎలాంటి హద్దులు లేవు. వరుస ఫోటో షూట్స్ తో వేడెక్కిస్తోంది. గత కొన్ని రోజులుగా రకుల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
త్వరలో ఆమె వివాహ వేడుక జరగబోతోంది. బాలీవుడ్ యువ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. అతి త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో కొత్త లైఫ్ ప్రారంభించబోతున్నారు. రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి వేడుకకి ఆల్రెడీ వెన్యూ ఫిక్స్ అయింది.
గోవాలోని ఐటీసీ గ్రాండ్ గోవా రిసార్ట్ లో వీరిద్దరి పెళ్లి వేడుక మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతోంది. రకుల్ పెళ్లి గ్రాండ్ గా జరగబోతున్నప్పటికీ పర్యావరణ కాలుష్యానికి తమ పెళ్లి కారణం కాకూడదని ఈ జంట నిర్ణయించుకున్నారు. ఎకో ఫ్రెండ్లిగా వీరి వివాహ వేడుక జరగనుంది. అయితే వెడ్డింగ్ వెన్యూ రిస్టార్డ్ గురించి తెలుస్తుంది వివరాలు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయ్. ఈ రిస్టార్ మొత్తం 45 ఎకరాల్లో ఉంటుంది. అవుట్ డోర్ స్విమింగ్ పూల్స్.. బీచ్ లొకేషన్ తో అందంగా ఉంటుంది. ఇండియా, పోర్చుగీస్ విలేజ్ స్టైల్ లో ఈ రిసార్ట్ ని నిర్మించారు.
మొత్తం 246 గదులు ఉండగా మూడు రోజులకు రకుల్, భగ్నానీ ఈ రిసార్ట్ ని బుక్ చేశారట. ఒక్కో గది రెంట్ 19వేల నుంచి 75 వేల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన రకుల్, భగ్నానీ మ్యారేజ్ కాస్ట్ ఎంత ఉంటుందో ఊహకి కూడా అందడం కష్టం. ఫిబ్రవరి 21న వెడ్డింగ్ జరగనుండగా.. 19 నుంచే సెలెబ్రేషన్స్ మొదలు కానున్నాయి.