Ram Charan in Pak media : రాంచరణ్ పై పాకిస్తాన్ మీడియా అధినేత ప్రశంసలు.. ఇది కదా కిక్కంటే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. బ్రిటిష్ పోలీస్ అధికారిగా పవర్ ఫుల్ గా కనిపిస్తూనే గుండెల్లో తన ఆశయాన్ని దాచుకుని అద్భుతంగా నటించాడు. అందుకే చరణ్ కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
ఇప్పుడు రాంచరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. రాంచరణ్ నార్త్ లో ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతలా చరణ్ క్రేజ్ వ్యాపించింది. అయితే మెగా ఫ్యాన్స్ కి మరింత కిక్కిచ్చేలా రాంచరణ్ క్రేజ్ పొరుగు దేశానికి కూడా వ్యాపించింది.
పాకిస్తాన్ మీడియాలో ఒక తెలుగు హీరో గురించి వస్తే ఎలా ఉంటుంది.. ఆ కిక్కే వేరు. తాజాగా రాంచరణ్ పై పాకిస్తాన్ మీడియా అధినేత ఒకరు ప్రశంసలు కురిపించడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పాకిస్తాన్ లో ప్రముఖ మీడియా అయిన సంథింగ్ హాట్ అధినేత హాసన్ చౌదరి రాంచరణ్ పై ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించారు.

రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో పెర్ఫామ్ చేసిన విధానం బ్రిలియంట్ అని హాసన్ కొనియాడారు. హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని రాంచరణ్ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ మొత్తాన్ని వర్ణించారు. ఎదురుగా రెండు వేల మంది ఉన్నప్పటికీ ధైర్యంగా వాళ్ళ మధ్యలోకి దూకిన విధానం.. ఎంత మంది ఉన్నా ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పోరాడిన విధానం.. తిరిగి అంతే రాయల్ గా తన స్థానంలో నిలుచున్న విధానం అద్భుతం.
టోటల్ ఎపిసోడ్ లో రాంచరణ్ పెర్ఫామెన్స్ చాలా కన్విన్సింగ్ గా ఉందని హాసన్ ప్రశంసించారు. రాంచరణ్ ని ఇండియాలో పొగడడం వేరు.. పాకిస్తాన్ వాళ్ళు కూడా పొగిడితే అది కదా కిక్కు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
