Ram Charan Upasana : మెగా ఫ్యాన్స్ గత కొన్నాళ్ల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. టాలీవుడ్లో ది మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ లవ్లీ కపుల్‌గా పేరొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల ఉపాసనలు అమ్మానాన్నలుగా ప్రమోషన్ అందుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెలకి పండంటి పాపాయి పుట్టింది. సోమవారం సాయంత్రం ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆమె వెంట, భర్త రామ్ చరణ్, అత్తగారు సురేఖ, ఆమె మదర్ అందరూ వెంట రాగ నిన్న రాత్రి అపోలో హాస్పిటల్ లో చేరిన ఉపాసన ఈరోజు అంటే మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మ ఇచ్చిందని ఆసుపత్రి ఒక ప్రత్యేక మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. 2012లో రామ్‌చరణ్ ఉపాసనల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్టు మెగా, కామినేని కుటుంబాలు గతేడాది నవంబర్ 12న వెల్లడించాయి.