Rashmika Mandanna: రష్మిక మందన్నా ముఖానికి ఏమైంది.. మాస్క్ తీయకపోవడం వెనక రీజన్ ఏంటి?
Rashmika Mandanna: సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్‌కు, అందానికి ప్రాధాన్యత ఉండే ప్రపంచం. ఈ రంగంలో నటీమణులు తమ కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి, మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి కఠినమైన డైట్‌లు, వ్యాయామంతో పాటు బ్యూటీ ట్రీట్‌మెంట్స్ చేయించుకోవడం సర్వసాధారణం. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఒక ఫేస్ ట్రీట్‌మెంట్ చేయించుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో, ముఖానికి మాస్క్ ధరించి చాలా సింపుల్‌గా కనిపించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కోసం కొద్దిసేపు మాస్క్ తీసి ఫోజులు ఇస్తుంటారు. కానీ ఈసారి రష్మిక మాత్రం మాస్క్ తీయడానికి నిరాకరించారు.
ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫోటోగ్రాఫర్లు, అభిమానులు “మేడమ్, మాస్క్ తీయండి, ఒక ఫోటో” అంటూ అడగ్గా, రష్మిక నవ్వుతూ “సారీ గైస్, ఇప్పుడు కుదరదు. ఫేస్ ట్రీట్‌మెంట్ అయ్యింది” అని సున్నితంగా తిరస్కరించారు. రష్మిక చెప్పిన ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. “రష్మిక ముఖానికి ఏమైంది?”, “ఏ రకమైన ట్రీట్‌మెంట్ చేయించుకుంది?”, “లిప్ ఫిల్లర్ వేసుకుందా?” అంటూ నెటిజన్లు రకరకాలుగా ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు.
ఇటీవల విడుదలైన కొన్ని ఫోటోలు వీడియోల్లో రష్మిక లుక్‌లో స్వల్ప మార్పులు కనిపించాయని, ముఖ్యంగా ఆమె పెదవుల వద్ద కొద్దిగా ఉబ్బినట్లుగా కనిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు. దీంతో ఆమె బ్యూటీ ఎన్‌హాన్స్‌మెంట్ ట్రీట్‌మెంట్ చేయించుకుందేమో అని కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు రష్మిక సహజంగానే చాలా అందంగా ఉంటుందని ఇలాంటి ట్రీట్‌మెంట్స్ అవసరం లేదని, సహజమైన లుక్‌లోనే ఆమె మరింత బాగుంటుందని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, కొందరు నెటిజన్లు వ్యక్తిగత జీవితాన్ని కూడా ముడిపెడుతూ… “విజయ్ దేవరకొండ, రష్మిక లవ్ రూమర్స్ పెరుగుతున్నాయి, బహుశా పెళ్లికి ముందు కొత్త లుక్ కోసం ఇలా చేసిందేమో” అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కాగా, రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీలో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
