Rashmika Mandanna : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడానికి కొంత టైం పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది.
పుష్పతో సినిమాతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో రష్మిక నటించిన గుడ్ బై ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా రష్మీకకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ మారింది.
రష్మిక తన పర్సనల్ మేనేజర్ చేతిలో మోసపోయినట్లు తెలుస్తుంది. ఆమె వద్ద చాలాకాలంగా పనిచేస్తున్న మేనేజర్ రష్మికకు సంబంధించిన 80 లక్షలు కాజేసినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రష్మిక ఆ మేనేజర్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్టు సమాచారం. ఈ ఇష్యూని ఇంకా పెంచే ఉద్దేశ్యం లేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ పుష్ప2, రణబీర్ కపూర్ యానిమాల్ మూవీస్ లో నటిస్తుంది.