Salman Khan: కండల వీరుడు సల్మాన్ ఖాన్.. 59 ఏళ్ల వయసులోనూ అదిరే సిక్స్ ప్యాక్ షో
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. 59 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గకుండా, తన అద్భుతమైన కండలు, సిక్స్ ప్యాక్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తూ ఆయన షేర్ చేసిన షర్ట్ లేని ఫొటోలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. సల్మాన్ ఫిట్‌నెస్‌కు నిదర్శనంగా నిలిచిన ఈ చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల కింద అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం పేరును గుర్తుచేస్తూ, “టైగర్ జిందా హై” అని ట్రెండింగ్ చేయడం విశేషం. కొందరు అభిమానులు సల్మాన్‌ను ఇండియా ఫిట్‌నెస్ ఐకాన్ అని పొగుడుతూ, ఆయన వయసుకు తగ్గకుండా చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసించారు. “ఈ వయసులో కూడా ఇంతటి ఫిట్‌నెస్ మైంటైన్ చేయడం కేవలం సల్మాన్‌కే సాధ్యం” అని మరికొందరు వ్యాఖ్యానించారు.
సల్మాన్ ఖాన్ ఈ ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. “కుచ్ హాసిల్ కర్నే కే లియే కుచ్ ఛోడ్నా పడ్తా హై.. యెహ బినా ఛోడే హై” అంటే, “కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి… కానీ ఇది వదులుకోకుండానే వచ్చింది” అని పేర్కొన్నారు. ఈ క్యాప్షన్ వెనుక ఉన్న అర్థం ఏమిటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
సల్మాన్ ఖాన్ రాబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ కోసం సిద్ధమవుతున్నట్లుగా ఈ ఫొటోలు చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఆయన మరింత కష్టపడి ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకున్నట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ విషయంలో తన నిబద్ధతను చాటిచెప్పిన ఈ పోస్ట్, రాబోయే సినిమాపై అభిమానుల అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో ఆయన గాల్వన్ ఘర్షణల నేపథ్యంగా ఒక బలమైన పాత్రలో కనిపించే అవకాశం ఉంది.
