Samantha Photos : బెడిసికొట్టిన సమంత ఫోటో షూట్.. ఆమె లేటెస్ట్ లుక్ పై ట్రోలింగ్
విజయ్ దేవరకొండ ఖుషి తర్వాత సమంత ఇంకా మరో కొత్త చిత్రం ప్రారంభించలేదు. సమంత మాయో సైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం సమంత పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లే ఉంది. స్టార్ హీరోలతో సమానంగా సమంత క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
సమంత ఎప్పుడు గ్లామర్ గా కనిపించినా కుర్రాళ్ళు వెర్రెత్తి పోతారు. అంతలా సమంత గ్లామర్ మాయ చేస్తుంది. కానీ తాజాగా ఆమె ఫెమినా మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ పూర్తిగా బెడిసి కొట్టినట్లు ఉంది. సమంత డిఫెరెంట్ గా కనిపించాలని ప్రయత్నించి ట్రోలింగ్ కి గురైంది. ఈ ఫోటో షూట్ లో సమంత లుక్ ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చే విధంగా లేదు.
ఆమె హెయిర్ స్టైల్, ధరించిన కాస్ట్యూమ్స్ అంతగా బాగాలేవు. దీనితో నెటిజన్లు ఏంటి.. చూస్తున్నది సమంతనేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.