Saranya Pradeep : పుష్ప జగదీశ్ కేసుపై అంబాజీ పేట నటి కామెంట్స్.. అతడి వ్యక్తిత్వంపై ఇలా..
అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. హీరో సుహాస్ ఖాతాలో మరో హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సుహాస్ సోదరి పాత్రలో నటించిన శరణ్య ప్రదీప్ కి మంచి గుర్తింపు దక్కుతోంది. ఫిదా, భామాకలాపం ఇలా శరణ్యకి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి.
అంబాజీ పేట మ్యారేజి బ్యాండు చిత్రంలో శరణ్య ఒక కీలక సన్నివేశంలో నగ్నంగా నటించి ఆశ్చర్యపరిచింది.ఆమె నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శరణ్య అనేక విషయాలు పంచుకుంది. అంబాజీ పేట చిత్రంలో శరణ్యని మనసారా ప్రేమించే వ్యక్తిగా పుష్ప ఫేమ్ జగదీశ్ నటించాడు.
పుష్ప చిత్రంలో పాపులర్ అయిన జగదీశ్ ఆ మధ్యన ఓ మహిళా ఆత్మహత్య కేసులో చిక్కుకున్నాడు. సదరు మహిళ ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ ఆమె మరణానికి కారణం అయ్యాడు అంటూ జగదీశ్ పై ఆరోపణలు ఉన్నాయి. జగదీశ్ తో కలసి శరణ్య నటించడంతో ఆమెకి అతడి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

దేశం మొత్తం గుర్తింపు తెచ్చుకున్న జగదీష్ ఇలా కేసులో చిక్కుకోవడం ఎలా అనిపిస్తోంది అని యాంకర్ ప్రశ్నించగా శరణ్య బదులిచ్చింది. జగదీష్ ఈ విధంగా కేసులో చిక్కుకోవడం బాధాకరం. అక్కడ ఏం జరిగిందో ఆ వ్యక్తికి తప్ప ఇంకెవరికి తెలియదు. మా సినిమా సెట్ లో నేను గమనించినంతవరకు జగదీష్ మంచి వ్యక్తే.
అందరితో గౌరవంగా ఆప్యాయంగా ఉండేవాడు. ఒదిగి ఉండే మనస్తత్వం. మాతోపాటు కింద కూర్చుని భోజనం చేసేవాడు. కానీ అతడి కేసు విషయంలో ఏం జరిగిందో మనకి తెలియదు కాబట్టి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అని శరణ్య పేర్కొంది.
