Jayalalitha : ఆ సీనియర్ హీరోతో బిడ్డని కనాలని ప్రయత్నించా.. ఆయన భయపడి ఏం చెప్పారంటే, నటి జయలలిత లవ్ స్టోరీ
సీనియర్ నటి జయలలిత అంటే టాలీవుడ్ లో ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలే గుర్తుకు వస్తాయి. అప్పట్లో బోల్డ్ రోల్స్ కి ఆమె పెట్టింది పేరు. మరీ హద్దులు దాటే విధంగా కాకపోయినా ఎక్కువగా ఆమె వ్యాంప్ రోల్స్ చేశారు. ఒక సారి ఆ ఇమేజ్ క్రియేట్ కావడంతో డైరెక్టర్లు అంతా తనకి అలాంటి పాత్రలే ఇచ్చారని జయలలిత అంటున్నారు.
కానీ తన ఇమేజ్ కి భిన్నంగా జయలలిత మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ గా నటించి మెప్పించారు. తాజాగా ఇంటర్వ్యూలో జయలలిత తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్, ప్రేమ వ్యవహారాల గురించి ఓపెన్ గా అన్ని విషయాలు రివీల్ చేశారు. ఆమె బయట పెట్టిన కొన్ని అంశాలు సంచలనంగా ఉన్నాయి.
ముఖ్యంగా సీనియర్ నటుడు దివంగత శరత్ బాబుతో తన లవ్ ఎఫైర్ ని జయలలిత బయట పెట్టారు. రమా ప్రభా ద్వారా శరత్ బాబుతో పరిచయం ఏర్పడిందట. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ శరత్ బాబు చాలా మంచి వ్యక్తి. ఆయనకి యాత్రలకు వెళ్లే అలవాటు ఉంది. ఆయనతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు.
ఒకరోజు నేను ఆడదాన్ని అని మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో యాత్రలకి వస్తా అని అడిగా. సరే అన్నారు. ఆ విధంగా ఆయనతో నా జర్నీ మొదలయింది. శరత్ బాబుని మనసారా ప్రేమించా. ఆయనతో బిడ్డని కనాలనే కోరిక ఉండేది. బిడ్డని కనేందుకు ప్రయత్నం కూడా చేశా.
కానీ ఆయన భయపడ్డారు. మనిద్దరం ఇప్పుడు బిడ్డని కంటే.. ఒక వేళ మనం చనిపోతే పరిస్థితి ఏంటి.. ఆ పిల్లాడినో పాపనో ఆస్థి కోసం చుట్టుపక్కల వాళ్ళు వేధించేస్తారు అని అన్నారు. ఆ విధంగా నాకు ఆయనతో బిడ్డని కనే అవకాశం దక్కలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. కానీ ఇండస్ట్రీలో కొందరు చెడగొట్టారు అని జయలలిత అన్నారు.
ఇక తాను గ్లామర్ పాత్రలు ఎక్కువ చేస్తాను కాబట్టి నన్ను అనుభవించాలని చాలా మంది ప్రయత్నించేవాళ్ళు. కొంతమంది నుంచి తప్పించుకునేదాన్ని. కొంతమందితో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి సుఖాన్ని అందించేదాన్ని. నేను చెడిపోయినా పర్వాలేదు.. నా ఫ్యామిలీ బావుండాలని కొందరితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు జయలలిత ఓపెన్ గా చెప్పేశారు.