Sarath Babu : శరత్కాల చంద్రిడిలా సమ్మోహనుడు. సగటు చిత్రాల కథానాయకుడు, విలక్షణత, విశిష్ణలత కలబోసిన నటుడు సత్యం బాబు. సత్యనారాయణ దీక్షితులు అంటే ఎవ్వరికీ పెద్దగా తెలియదు. సినీ పరిశ్రమలో సుపరిచితమైన పేరు శరత్ బాబు.1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాల వలసలో ఆయన జన్మించారు. 1973లో రామరాజ్యం అనే సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి తెరంగేట్రం తర్వాత కన్నడ సినిమాలో నటించి తర్వాత సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ సినిమా చేసి పరిశ్రమలో కుదురుకున్నాడు.
ఆ తర్వాత అమెరికా అమ్మాయి సినిమాలో నటించి తర్వాత బాలచంద్ర డైరెక్షన్ లో చిలకమ్మా చెప్పింది సినిమాలు చేశాడు. మొదటి సినిమా రామరాజ్యం. అయితే ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం రాబట్టలేకపోయింది. శరత్ బాబు ప్రతిభను చూసి ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశమ్’ అనే మూవీలో నటించే అవకాశం కల్పించాడు. ఆరడుగుల అందగాడ , స్పుర ద్రూపి శరత్ బాబు.. గ్లామరస్‌గా ఉన్న.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే పరిమితమయ్యాడు. తెలుగు నుంచి ప్యాన్ ఇండియా నటుడిగా వివిధ భాషల్లో సత్తా చూపిన నటుల్లో శరత్ బాబు ఒకరు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో గుర్తింపు సాధించాడు. తెలుగు, తమిళ, కన్నడ , మలయాళం, అలాగే హిందీ భాషల్లో కలుపుకొని దాదాపుగా 220 కి పైగా చిత్రాల్లో నటించాడు. హీరో వేషాలతో ఆకట్టుకున్నాడు, విలన్ వేశాలతో భయపెట్టాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రతిభ చూపించాడు. విభిన్న పాత్రలలో కనిపించి ఆడియన్స్ మనసులు గెలుచుకున్నా.. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ పరిశ్రమలో కూడా ఆయనకు మంచి పేరు ఉంది. సుమారు 2000 పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు, ఏ క్యారెక్టర్ చేసిన అందులో లీనమై నటించేవాడు. ఈటీవీ ‘అంతరంగాలు’ సీరియల్ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది.
పోలీస్ కావాలి అనేది ఆయన కోరిక :
ఐతే.. దృష్టిలోపం కారణంగా పోలీస్ కాలేకపోయాడు. 1990 కోకిల,1998 పెళ్లి పందిరి ఇన్స్పెక్టర్ రామారావు 2006రాఖీ, పోలీస్ కమీషనర్ 2008 సౌకర్యం పోలీస్ ఆఫీసర్ వేషాల్లో అలరించిన ఘనత శరత్ బాబు సొంతం 1973లో హీరోగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. సినిమాలతో పాటు, సీరియల్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న శరత్ బాబు, ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడు అవార్డు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలతో పాటు ‘వేకింగ్ డ్రీమ్స్’ అనే ఓ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించారు1981 నుంచి 1983 వరకు మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. సీతాకోకచిలుక, నీరాజనం, ఓ భార్య కథ వంటి సినిమాలకు అవార్డులు కూడా వచ్చాయి.
శరత్ బాబుకు స్వతహాగా ఎస్వీ రంగరావు అంటే ప్రత్యేక అభిమానం. అందుకే ఆయనలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో మెప్పించాడు. తెలుగువాడు తెలుగు భాషలో గుర్తింపు తెచ్చుకుంటే పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ శరత్ బాబు ఇతర భాషల్లో కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న బహుకొద్ది మంది నటుల్లో శరత్ బాబు ఒకరు. ఒక రకంగా ప్యాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సితారలో మరో వైవిధ్యమైన పాత్ర లో నటించి మెప్పించాడు. హలో బ్రదర్‌లో హీరో నాన్న క్యారెక్టర్ సీతాకోక చిలక మూవీలో హీరోయిన్ అన్న పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో విలన్ ఛాయలున్న క్యారెక్టర్‌తో అలరించాడు. భారతీరాజ దర్శకత్వంలో 1981 లో రిలీజ్ అయిన ఈ మూవీలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు అందుకున్నాడు.
అటు సంసారం ఒక చదరంగం వంటి సినిమాల్లో నెగిటివ్ పాత్రలో మెప్పించిన ఘనత శరత్ బాబుకే దక్కుతోంది. సాగర సంగమంలో కమల్ హాసన్ మిత్రుడిగా నటించి మన్ననలు పొందాడు స్వాతి గౌతమి , సంకీర్తన, అభినందన, ఆపద్బాంధవుడు, గౌతమి , సంకీర్తన లాంటి చిత్రాలలో మహిళా ప్రేక్షకుల మన్నన పొందాడు. 2021 వకీల్ సాబ్ తెలుగులో చివరై సినిమా దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు పొందిన శరత్ బాబు మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.