Venkatesh Maha: మహేష్ బాబు నిర్మాతగా, ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడి డైరెక్షన్‌లో.. సత్యదేవ్ హీరోగా కొత్త సినిమా!
Venkatesh Maha: ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి విలక్షణమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. ఈ రెండు చిత్రాలతో తన ప్రతిభ ఏమిటో చాటి చెప్పాడు. నేటివ్ స్టోరీలకు తనదైన శైలిలో జీవం పోసి ప్రేక్షకుల మదిని గెలవడంలో వెంకటేష్ మహా ప్రత్యేకతే వేరు. ఈ యంగ్ అండ్ డైనమిక్ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి సినిమా వచ్చి చాలానే రోజులు అవుతోంది.
ఎప్పుడెప్పుడా అని అభిమానులు, తెలుసు సినీ ప్రేక్షకుల ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా వెంకటేష్ మహా తన కొత్త సినిమాను ప్రకటించారు. చాలా కాలం తర్వాత తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి మొదలైంది. ఈ చిత్రంలో నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తుండటం మరో విశేషం. సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా కావడం గమనార్హం. మొదటి సినిమా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య కాగా.. ఆ సినిమా మంచి టాక్ అందుకుని సత్యదేవ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ కాంబో మళ్లీ రిపీట్ కానుండటం అంచనాలను పెంచేసింది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. దీనిలో ఆభరణాలతో ఉన్న ఒక వ్యక్తి చేతిని చూపించడంతో పాటు, “Remember, Doubt is a Demon” అనే క్యాప్షన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ సినిమా కథాంశంపై అనేక ఊహాగానాలకు దారితీసింది. అంతేకాకుండా, ఈ చిత్రానికి ‘RB’ అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టినట్లు వెల్లడించారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రేపు మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
https://x.com/mahaisnotanoun/status/1954795491021193373
ఈ ప్రాజెక్టులో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ కలయికతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్ మరోసారి ఎలాంటి మ్యాజిక్ రానుందో చూడాలి.
