Sharmila not Contesting : YS ఫ్యామిలీ తీరే వేరు.. !!
రాజకీయాల్లో వైయస్ ఫ్యామిలీ తీరే కాస్త భిన్నంగా ఉంటుంది. తాము ఏం చెప్పినా జనాలు నమ్ముతారు అనుకోవడం కాదు నమ్మాల్సిందే అన్నట్లు ఉంటుంది వాళ్ళ తీరు. ప్రజల కోసమే తాము పుట్టామని తాము లేకుంటే ప్రజలు ఏమైపోతారో అన్నట్లు బిల్డప్ ఇవ్వడంలో వాళ్లు సిద్ధహస్తులు.
ఎవరైనా కొత్త పార్టీ పెడితే ప్యాకేజీ కోసం పార్టీ పెట్టారని.. ఎలక్షన్స్ లో వేరే పార్టీలకు మద్దతు ఇస్తే డబ్బులు కోసమే మద్దతు ఇచ్చారని ప్రచారం చేయడంలో ఆ ఫ్యామిలీకి మించిన వాళ్లు లేరు. ఇప్పుడు విషయానికి వస్తే తెలంగాణలో పోటీ చేయడం లేదంటూ కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు అంటూ షర్మిల ప్రకటించారు. గతంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రచారం చేస్తున్న సమయం లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అంటూ విమర్శించిన షర్మిల ఇప్పుడు ఎంత ప్యాకేజ్ కి కాంగ్రెస్ కి అమ్ముడుపోయారు అనేది ప్రశ్న..
Telangana Election : తీస్ రీ బార్ కేసీఆర్ సర్కార్..
వేరే పార్టీలకు మద్దతు ఇవ్వడం అమ్ముడుపోవడం అయితే ఇప్పుడు తను చేస్తుంది ఏంటి? తను కూడా అమ్ముడుపోయినట్టేనా..? అదీ గాక తమ తండ్రిది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని అనుమానాలు ఉన్నాయంటూ గతంలో కాంగ్రెస్ పైనే సందేహం వెలిబుచ్చి.. జనంలో ప్రచారం చేసిన వైయస్ ఫ్యామిలీ ఇప్పుడు జనాలకు ఆ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా..?
హామీల పేరుతో ప్రజలను జగన్ ఎలా మోసం చేస్తున్నాడో వివరించిన పవన్ కళ్యాణ్..
కాంగ్రెస్ పార్టీ వల్ల తన అన్న జైలుకు వెళ్లాల్సి వచ్చింది అనీ తమ కుటుంబం ఎన్నో ఏళ్లు సేవ చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, తమ కుటుంబాన్ని కాంగ్రెస్ వేధించిందని తమకు ద్రోహం చేసింది అంటూ గగ్గోలు పెడుతూ గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సమయంలో వైసిపి పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించలేదా..? ఇప్పుడు వాటికి సమాధానం ఏంటి..?
రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ మొహాన ఉమ్మేస్తారు అంటూ ఒక సందర్భంలో ఘాటైన విమర్శలు చేశారు ఆవిడ.. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో తమదే అధికారమని నేను తెలంగాణ కోడల్ని అని రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఇలా రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చి తెలంగాణలో పోటీ చేస్తున్నానని చెప్పారు
తర్వాత కొన్నాళ్లు ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికోసం షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియాని కూడా కలిసి వచ్చారు. తర్వాత ఏమైందో తెలియదు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లేకపోవడం.. మళ్ళీ తెలంగాణ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నామంటూ.. తాను పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్లు షర్మిల ప్రకటించారు.. ఇలా రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు తీరా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి తెలంగాణలో తమ పార్టీ పోటీ చేయడం లేదని తమ పార్టీ సంపూర్ణంగా కాంగ్రెస్కే మద్దతు అంటూ తాజాగా ప్రకటించారు ఆవిడ..
రాజకీయ పార్టీలు ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం.. కొన్నాళ్లు విమర్శలు చేసినా తర్వాత అవసరాల దృష్ట్యా పొత్తులు పెట్టుకోవడం కూడా సహజమే.. కానీ వైయస్ ఫ్యామిలీ కాంగ్రెస్ పై చేసిన విమర్శలు.. చేసిన ప్రచారం వేరు.. అదే ఇక్కడ ప్రశ్న.. అంటే ఇన్నాళ్లు వాళ్లు చేసింది.. చేసేది.. చెప్పేది అబద్ధాలు అనే కదా..? అంటే YS ఫ్యామిలీ తమ పార్టీల గెలుపు కోసం ఎంతకు దిగజారి అయినా ప్రచారం చేస్తారా.. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది..