Telangana Election : తీస్ రీ బార్ కేసీఆర్ సర్కార్..
Telangana Election : కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల తేదీల నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో ఎన్నికల గజెట్ నోటిఫికేషన్ నవంబర్ 3న రానుంది. నామినేషన్స్ స్వీకరణ నవంబర్ 10న జరగనుంది. నామినేషన్ల పరిశీలన నవంబర్ 13న జరగనుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15న జరగనుంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలో ఎన్నికల నగారా మోగింది.
Pawan Kalyan – Telangana : బాలిక సామూహిక అత్యాచారంపై పవన్ కళ్యాణ్ సీరియస్..
బీఆర్ఎస్ పార్టీ ముందుగానే 119 అసెంబ్లీ స్థానాల్లో… 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది. దాంతో.. నెల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు జిల్లాల్లోకి వెళ్లిపోయి.. ఎన్నికల ప్రచారం, కార్యకర్తల సమీకరణ, ప్రజలతో టచ్‌లో ఉంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలో ఆ పరిస్థితి లేదు. గత పొరపాట్లనే ఇప్పుడూ ఆ పార్టీలు చేస్తున్నాయి.
అధికార భారత రాష్ట్ర సమితి – బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీ రామారావు , మంత్రి హరీష్ రావు సుడిగాలి పర్యటనలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీపై ధాటిగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇక భారతీయ జనతా పార్టీ – బీజేపీ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ధీటుగా ప్రచారం సాగిస్తూ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసే పనిలో పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో అధికార పీఠం కైవసం చేసుకోవడమే పరమావధిగా పని చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎవరి బలాబలాలు వారికున్నాయి. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ 88 సీట్లను సాధించి మరో సారి తమ సత్తా చాటుకుంది. ఆ తర్వత ఒక్కొక్కరిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను తమ పార్టీలో చేర్చుకొని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి వందకు పైగా ఎమ్మెల్యేలతో అప్రతిహతంగా తమ పాలన సాగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలాబలాలు ఓ సారి పరిశీలిస్తే…ప్రభుత్వ సంక్షేమపథకాలు, రైతుబంధు, దళిత బంధు లాంటి పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ, చేతి వృత్తులకు చేయూత పేరుతో బీసీ కులాలకు లక్ష రూపాయల నగదు బదిలీ, పూర్తయిన ఇరగేషన్, ప్రాజెక్టులు, అభ్యర్థుల ముందస్తు ప్రకటన, ఇప్పటికే మొదలైన ప్రచారం, ఇతర పార్టీల నుంచి వలసలు ప్రోత్సహించి వారిలో కొందరికి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడం బలాలు కాగా… సిట్టింగ్ ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా ఉండటం ఆ పార్టీ కి ప్రధాన ప్రతిబంధకంగా మారింది.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి ఆవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకులకు, ద్వీతయ శ్రేణి నాయకులకు అవకాశం దక్కకపోవడంతో వాళ్లంతా పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ఆ సంతృప్తులకు నామినేషన్ పదవులు కట్టబెట్టినా పరిస్థితి ఏ మేరకు చక్కబడతుందన్నది ప్రశ్నార్థకమే. గతంలో ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి లాంటి కార్యక్రమాలు అమలుకు నోచుకోక పోవడం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పూర్తి కాకపోడం..
పూర్తయిన ఇళ్లను కేవలం నాయకుల అనుచరులకే కేటాయించారనేది ప్రభుత్వంపై ఉన్న ప్రధానమైన అపవాదు. దళిత బంధు పథకంలో కమీషన్లు, బీసీలకు ఇచ్చే లక్ష రూపాయల ఆర్థిక సాయంలో ఎమ్మెల్యేల అనుచరులకై లబ్ధి చేకూర్చడం తదితర విమర్ళలు అధికార పార్టీపై కచ్చితంగా ప్రతిబంధకాలు అవుతాయి.పదేళ్ల పాలనతో ప్రభుత్వంపై సహజంగా వ్యతిరేకత ఉంటుంది. ఇక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని నియంతల్లా వ్యవహరించారని… వారిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ పై తీవ్ర
ప్రభావాన్ని చూపుతుందని దీన్ని అధిగమించడం కోసం అధికార పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అవి ఏ మేరకు పని చేస్తాయో చూడాలి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. బీఆర్ఎస్ పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని నమ్ముతున్న ఆ పార్టీ… బీఆర్ఎస్ లోని అసంతృప్తులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు లాంటి నాయకులను పార్టీలో చేర్చుకొని ఆయా జిల్లోలో పటిష్టమైందనే చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వమ్యం పేరుతో లోలోన విభాదాలు ఎన్ని ఉన్న… దాదాపు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటంతో పార్టీ నాయకుల్లో విభేదాల్లో సైతం ఓ ఐక్యత కనిపిస్తోంది. కర్నాటక ఎన్నికల విజయంతో ఊపు మీదున్న ఆ పార్టీ ఎలాగైనా తెలంగాణాలోనూ అధికారంలోకి రావాలనే పట్టు కనిపిస్తోంది. టికెట్ల కేటాయింపుల్లో, ప్రచారంలోనూ అధిష్టానంతో సమన్వయం చేసుకుంటూ ఓ ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలనే భావనతో ఉన్నారు.
బీజీపీ విషయానికొస్తే… గతంతో పోల్చితే కాస్త ఊపు తగ్గినట్టుగా కనిపిస్తోంది. డిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేంద్రం కఠినంగా వ్యవహరించలేదని వాదన ప్రజల్లో కనిపిస్తోంది. దీనికి తోడు బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామకం కూడా పార్టీ కార్యకలాపాలు కాస్త నెమ్మదించేలా చేశాయి.. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటెల రాజెందర్ ఎమ్మెల్యేలుగా గెలుపొందినా ఇంకా పార్టీ నాయకత్వం ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దింపేందుకే ప్రయాస పడాల్సి వస్తోంది.
మరోవైపు… ఎంఐఎం తెలంగాణ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ వెన్నంటే ఉంది. ఆ సారి ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇప్పుడున్న ఏడు సీట్లపైనే మళ్లీ దృష్టి సారించింది. మిగతా పార్టీలో కూడా ఆ సీట్లను ప్రతీ ఎన్నికల్లోనూ ఎంఐఎం ఖాతాలోనే వేసి మిగతా వాటి కోసం పోటీ పడుతుంటాయి. ఇక మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈసారి బరిలో నిలుస్తాయి.
మరోవైపు… ఎంఐఎం తెలంగాణ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ వెన్నంటే ఉంది. ఆ సారి ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇప్పుడున్న ఏడు సీట్లపైనే మళ్లీ దృష్టి సారించింది. మిగతా పార్టీలో కూడా ఆ సీట్లను ప్రతీ ఎన్నికల్లోనూ ఎంఐఎం ఖాతాలోనే వేసి మిగతా వాటి కోసం పోటీ పడుతుంటాయి. ఇక మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈసారి బరిలో నిలుస్తాయి.