Shraddha Kapoor New look in Saree : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో సినిమాలో నటించిన ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ మీకు గుర్తు ఉంది కదా.. ఈ అమ్మడు ఆ సినిమాతో ఇటు సౌత్ లోనూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అలాగే హిందీ సినిమా రంగంలో కూడా వరుస విజయాలతో దూసుకెళ్తుంది.
చిన్నతనంలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదంటూ ముద్ర వేసుకొని, 2010లో తీన్ పత్తి అనే హిందీ సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన శ్రద్ధ కపూర్ ఆ తర్వాత వరుస సినీ అవకాశాలతో, విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ప్రేక్షకుల నుండి పొందింది.
అటు సినిమాలతోనే కాకుండా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. తన లేటెస్ట్ పిక్స్ ని అప్లోడ్ చేస్తూ కుర్రకారు మనసుల్లో ఉషారు రేకెత్తిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ చీరకట్టలో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేడింగ్ గా నిలిచాయి. సాధారణంగా హీరోయిన్స్ చీర కట్టులో ఎక్కువగా క్లి వేజ్ షో చేస్తూ, సెక్సీ గా కనిపించాడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు..
కానీ శ్రద్ధ కపూర్ మాత్రం ఎలాంటి స్కిన్ షో చేయకుండా నీట్ గా చీరకట్టుతో ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. కొందరు ఆ ఫోటోలను చూసి నిరుత్సాహపడగా మరికొందరు ఎప్పుడు స్కిన్ షో చేయడమేనా హీరోయిన్ అంటే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో కూడా ట్రై చేయాలి అంటూ ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు..శ్రద్దా కపూర్ చీరకట్టును మీరు చూసేసి, మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి..