Sore Throat Relief Tips : వర్షాకాలం మొదలవ్వగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గొంతు నొప్పి, జలుబు, దగ్గు సమస్యలు వాటిలో గొంతు నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. అది వచ్చినప్పుడు ఏలాంటి రెమెడీస్ పాటించి తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం.. గొంతు నొప్పి వస్తే తినడము, నీళ్లు తాగడం చాలా కష్టమవుతుంది .నిద్ర భంగం కూడా కలుగుతుంది. దాని తట్టుకోలేక చాలా మంది పెయిన్ కిల్లర్స్ నీ ఆశ్రయిస్తూ ఉంటారు.
టాబ్లెట్స్ వాడడం వల్ల అప్పటివరకు గొంతు నొప్పి తగ్గుతుందేమో కానీ శాశ్వత పరిష్కారం ఉండదు. అయినా కూడా అటువంటి పెయిన్ కిల్లర్స్ వాడితే అనారోగ్య సమస్యలు తలెత్త అవకాశాలు కూడా ఎక్కువే. కొన్ని సింపుల్ టిప్స్ పాటించి గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనా ఆకులు గొంతు నొప్పిని ఉపశమనం కలుస్తాయి పుదీనా ఆకులతో టీ చేసుకొని తాగడం మంచిది.
నీళ్లలో పుదినాకులను వేసి మరిగించి,కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం తురుము వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి రోజు రెండు పూటలా తాగాలి. గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇంకొక రెమిడి.. గోరువెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని కలిపి దానితోపాటు ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ లో మరియు తేనెల ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ గొంతు నొప్పిని తగ్గిస్తాయి.
దాల్చిన చెక్క బాదంపాలు గొంతు నొప్పి నుంచి త్వరగా బయట పడేస్తాయి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక చిన్న కప్పు వాటర్ పోసుకొని ఆఫ్ వాటర్ అయిన తర్వాత దాంట్లో దాల్చిన చెక్క పొడి వేసి మరిగించాలి. ఒక నిమిషం పాటు హీట్ చేసి స్టైనర్ తో ఫిల్టర్ చేసుకొని పాలలో కొద్దిగా తేనె కలుపుకొని తాగాలి. గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతుంది.