Strange Places : ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, వింతలు చోటుచేసుకుని ఉన్నాయి. కొన్ని వినడానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనుషులు అడుగుపెట్టని స్థలం అంటూ లేదు. కానీ కొన్ని ప్రదేశాలలో మనుషులను అడుగుపెట్టనివ్వరు. అవి మనుషులకు నిషేధిత ప్రాంతాలు. ఆ ప్రాంతాలు ఎక్కడున్నది.. వాటి వెనక గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ముఖ్యంగా ఈ ప్రపంచంలో 8 ప్రదేశాలకు మనుషులను అసలు అనుమతించారు.
వాటిలో మొదటిది..నెవాడా ఏడారిలోని ఏరియా 51,( Area 51 ) యూఎస్-యూఎస్ వైమానిక దళం. ఈ రహస్య ప్రాంతంలోకి ఎవరిని అనుమతించరు ఈ ప్రాంతాన్ని ఏరియా 51 అని పిలుస్తారు. రెండవది ఉక్రెయిన్ చెర్నోబిల్ జోన్ (Chernobyl Zone ) ఈ ప్రదేశం కూడా భూమిపై ఉన్నటువంటి ప్రసిద్ధ నిషేధిత ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ రేడియేషన్ అధికంగా ఉంటుంది. ఈ వాతావరణం అంతా కలుషితమై ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలోకి ఎవరిని అనుమతించారు.
నార్త్ సెంటినెల్( North Sentinel ) ద్వీపంలోకి మనుషులను అనుమతించరు. ఇక్కడ సెంటినెలీస్ తెగకు చెందినవారు జీవిస్తూ ఉంటారు. వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కాబట్టి ఈ ప్రదేశంలోకి వేరే ఏ మనుషులను అనుమతించరు. మౌంట్ వెదర్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్( Mount Weather Emergency Operations Center ) యూఎస్ఏలోని వర్జనియాలోని బ్లూరిడ్జ్ పర్వతాలలో కలదు. యూఎస్ ప్రభుత్వానికి గాను బ్యాకప్ లోకేషన్ గా దీనిని అభివర్ణిస్తూ ఉంటారు. కాబట్టి సామాన్యులకు ఇక్కడ నో ఎంట్రీ.
సావో పాలోలోని ఇల్హా డా క్యూయిమాడా గ్రాండే ద్వీపంలో( Ilha da Queimada Grande Island) అత్యంత విషపూరితమైన పాములకు నిలయం. దీని స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. విషపూరితమైన పాములతో ముప్పు ఉండడం వల్ల బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడికి మనుషులను అనుమతించదు.చైనాలో ఉన్న క్విన్ షి హువాంగ్ సమాధి( Qin Shi Huang Tomb ) దగ్గరికి సాధారణ మనుషులకు ప్రవేశం లేదు. ఈ సమాధి చాలా రహస్యాలతో కూడుకున్నది కావడం వల్ల చైనా ప్రభుత్వం రాకపోకలపై నిషేధం విధించింది.