TDP- Janasena : ఎన్నికల దగ్గర పడుతున్న వేళ టీడీపి నేతల్లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. పార్టీ ఆవిర్భావం నుండి అలాగే, చంద్రబాబు నాయుడు టిడిపి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా కొందరు నాయకులు ఆయన వెంట ఉండి, నమ్మకంగా పార్టీకోసం పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సీనియర్ నాయకులకే పెద్ద చిక్కు వచ్చి పడింది.
ఈసారి జరిగే ఎన్నికల్లో సీనియర్స్ కి ఛాన్స్ ఇస్తారా.? లేదా.? అనేది ఇప్పుడు టిడిపిలో నెలకొన్న సందిగ్ధం. సీనియర్స్ అందరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో పాల్గొని పదవులు చేపట్టిన వాళ్లే, ప్రస్తుతానికి జనసేన, టిడిపి రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేన బలోపేతం కావడం కోసం కొన్ని, కొన్ని కీలక నియోజకవర్గాలు తమకు కేటాయించాలని జనసేన షరతులు పెట్టిందని వినికిడి.
జనసేన కోరుకునే నియోజకవర్గాలు ఇంతకుముందు టిడిపి సీనియర్ నాయకులు పోటీ చేసిన ప్రాంతాలు. దీంతో ఇప్పుడు ఆ సీనియర్లలో టెన్షన్ మొదలైంది. పార్టీ కోసం సీనియర్స్ కచ్చితంగా ఆ నియోజకవర్గాలను త్యాగం చేయవలసిందే అంటున్నారు. అయితే తమకు ఏ నియోజకవర్గాలు కావాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఒక జాబితాను ఇచ్చారని తెలుస్తుంది. మొత్తంగా 30 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంటుందని సమాచారం.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ఒక కొత్త కిటుకుని పెట్టినట్లుగా తెలుస్తుంది. గతంలో ప్రజారాజ్యం గెలిచిన అసెంబ్లీ స్థానాలతో పాటు, 2019 ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ ఓట్లు పడిన నియోజకవర్గాలను కూడా తమ కేటాయించాలని అని పవన్ కళ్యాణ్ కోరారంట.
ఆ ప్రాంతాలన్నీ టిడిపి సీనియర్ నేతలకు చెందిన ప్రాంతాలు అవడంతో ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సందిగ్ధంలో పడ్డారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే టీడీపీ సీనియర్ నేతలు త్యాగం చేయడం తప్పించి దీనికి వేరే మార్గం లేదు.
భీమవరం, గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా,ఇక తెనాలిలో టిడిపి నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ బలంగా ఉన్నప్పటికీ, ఈ సీటును జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి. ఆ నిర్ణయానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే.