This Weekend Movies: ‘కొత్త లోక’, ‘కాంతర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి ఇంకేం సినిమాలు వచ్చాయంటే?
This Weekend Movies: ఒకవైపు థియేటర్లలో ‘బాహుబలి ది ఎపిక్’ సినిమాతో మాస్ జాతర మొదలవగా, మరోవైపు ఓటీటీ వేదికలు కూడా ఈ వారం బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. మలయాళంలో సంచలనం సృష్టించిన ‘కొత్త లోక’తో పాటు, కన్నడ సినీ చరిత్రలో మరో మైలురాయి అయిన ‘కాంతార చాప్టర్ 1’ వంటి భారీ చిత్రాలు ఈ వారాంతంలో డిజిటల్ తెరపైకి వచ్చాయి. ఇంకేం ఆలస్యం ఈ వీకెండ్‌లో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ వారం ఓటీటీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కాంతార’ (చాప్టర్ 1). ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌పై స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటు, ‘హెడ్డా’ (సినిమా), విదేశీ వెబ్‌సిరీస్‌లు ‘హెజ్బిన్ హోటల్’, ‘ఎలెనార్ ది గ్రేట్’ కూడా అందుబాటులో ఉన్నాయి.
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘కొత్త లోక’ సినిమా ఈ వారం జియో సినిమా / డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ మల్టీ-లాంగ్వేజ్ ఆడియెన్స్‌ను ఆకర్షిస్తోంది. ఇంకా, హిందీ వెబ్‌సిరీస్ ‘మానా కీ హమ్ యార్ నహీ’ మరియు హాలీవుడ్ సిరీస్ ‘ITWelcomeToDerry’ (ఇంగ్లీష్, హిందీ) వీక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఈ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘ఇడ్లీ కొట్టు’ అనే సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. వీటితో పాటు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఫాంటసీ వెబ్‌సిరీస్ ‘ది విచర్’ సీజన్ 4 (The Witcher Season 4) ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సందడి చేస్తోంది.
జీ5లో ‘రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్’ (సినిమా), మరాఠీ చిత్రం ‘భాయ్ తుజైపాయి’, ‘మారిగల్లు’ (సినిమా) స్ట్రీమింగ్ అవుతున్నాయి. సన్‌నెక్ట్స్‌లో ‘బ్లాక్ మెయిల్’ సినిమా, ఈటీవీ విన్‌లో ‘రిద్ది’ (కథా సుధ) వెబ్‌సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ వీకెండ్ అంతా నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో గడిపేందుకు ఓటీటీలో కంటెంట్ కొదవ లేదు.
