Trivikram Venky: వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమాకు సరికొత్త సంగీతం.. ‘యానిమల్’ మ్యూజిక్ డైరెక్టర్‌తో స్పెషల్ ప్లాన్?
Trivikram Venky: టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఒకటైన వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫుల్ లెంగ్త్ సినిమాపై కొత్త అప్‌డేట్‌లు వెలువడుతున్నాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవల గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ లేదా థమన్ సంగీతం అందిస్తుండేవారు. అయితే, ఈసారి త్రివిక్రమ్ తన రెగ్యులర్ మ్యూజిక్ కంపోజర్‌లకు భిన్నంగా కొత్త రూట్ ఎంచుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మ్యూజిక్ లవర్స్‌కి ఒక నయా అనుభూతిని అందించేందుకు, తాజాగా సంచలనం సృష్టించిన ‘యానిమల్’ చిత్రానికి నేపథ్య సంగీతం అందించిన కంపోజర్‌ను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా హర్షవర్థన్ రామేశ్వర్ పేరును త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ ఇన్‌సైడ్ టాక్. ‘యానిమల్’ సినిమాకు తన నేపథ్య సంగీతంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హర్షవర్థన్ రామేశ్వర్, వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమా కోసం ఎలాంటి పాన్ ఇండియా ఆల్బమ్, బీజీఎం సిద్ధం చేస్తారో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ నిర్ణయం ద్వారా, త్రివిక్రమ్ కేవలం ఒక రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాకుండా, సరికొత్త మ్యూజికల్ ఫీల్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఆమె ఎంపికపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు త్రివిక్రమ్ తన దృష్టిని వెంకటేశ్ సినిమాపై పెట్టినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రానున్న సినిమా పూర్తయిన తర్వాత, త్రివిక్రమ్ దర్శకత్వం వహించే మైథలాజికల్ ఫిల్మ్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
