• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Janasena News

Ustaad Teaser : సరైన టైంలో దింపాడు..వైసీపీకి గాజు గ్లాస్ బాగా గుచ్చుకుందిగా, సొంత మీడియాలో పసలేని ట్రోలింగ్ 

Satya by Satya
March 20, 2024
in Janasena News, Latest News, Movie Articles
0 0
0
Pawan Kalyan

Pawan Kalyan

Spread the love

Ustaad Teaser : సరైన టైంలో దింపాడు..వైసీపీకి గాజు గ్లాస్ బాగా గుచ్చుకుందిగా, సొంత మీడియాలో పసలేని ట్రోలింగ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సంగ్రామం కోసం సమాయత్తం అవుతున్నారు. పొత్తులో సీట్ల విషయం కూడా కొలిక్కి వస్తోంది. కొన్ని చోట్ల మినహా జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు. జనసేనాని స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మంగళవారం రోజు తంగెళ్ల ఉదయ్ ని సేనాని ప్రకటించారు. ఇలా జోరుగా జనసేన పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అదే సమయంలో మరోవైపు ఆన్లైన్ క్యాంపెనింగ్ కూడా సాగుతోంది. జనసేన నుంచి ప్రజలని ఆలోచింపజేసే ప్రకటనలు వెలువడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో కంటెంట్ వైరల్ అవుతుంది. అది గమనించిన పవన్ సినిమా మాధ్యమాన్ని ఎంచుకున్నారు.

పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాలిటిక్స్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. అయితే సినిమా ద్వారా గాజు గ్లాసు గుర్తుని పవన్ వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. హరీష్ శంకర్ రాసే డైలాగులకు పదును ఎక్కువ. ఉస్తాద్ నుంచి గాజు గ్లాస్ ఉన్న టీజర్ వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం పవన్, హరీష్ అదే చేసి చూపించారు. గాజు గ్లాస్ తో పాటు, పొలిటికల్ డైలాగ్ ఉండే టీజర్ ని రిలీజ్ చేశారు. సరైన టైంలో టీజర్ రావడంతో సోషల్ మీడియాలో ఉస్తాద్ టీజర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. విలన్ ఇదీ నీ రేంజ్ అని గాజు గ్లాస్ ని కింద పడేస్తాడు. గ్లాస్ పగిలిపోతుంది. పగిలిన గ్లాసు ముక్కతోనే పవన్ విలన్ పై అటాక్ చేస్తాడు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటూ హరీ రాసిన డైలాగ్.. పవన్ చెప్పిన విధానం మైండ్ బ్లోయింగ్.

ఖచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం అంటూ చివర్లో పవన్ చెప్పిన డైలాగ్ తెగ వైరల్ అవుతోంది. అయితే గాజు గ్లాస్ తో పరోక్షంగా పవన్ వైసిపిని అటాక్ చేసినట్లు అయింది. అయితే ఇది వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. సొంత మీడియాలో పసలేని ట్రోలింగ్, విమర్శలు చేయిస్తున్నారు.

Kakinada Janasena MP Candidate : పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటా.. కాకినాడ ఎంపీ అభ్యర్థిని స్వయంగా ప్రకటించిన పవన్

నిర్మాతల డబ్బుతో పవన్ ప్రచారం చేయించుకుంటున్నారు అని వింత వాదన తీసుకువచ్చారు. గురుగింజకి తన నలుపు గుర్తెరగాడు అనే సామెత ఉంది. అది వైసిపి వాళ్ళకి బాగా సరిపోతుంది. మరి ఆర్జీవితో, మహి వి రాఘవ్ తో వైసిపి వెనుక ఉండి చేసిస్తున్న సినిమాల సంగతి ఏంటి అని జనసైనికులు దుమ్మెత్తి పోస్తున్నారు. జనసైనికుల ప్రశ్నకు వైసిపి వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఏది ఏమైనా సరైన టైం పై పవన్ కరెక్ట్ గా గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకువెళ్లాడు అని అంటున్నారు.


Spread the love
Tags: Bhagat's BlazeDSPHarish ShankarJanasena PartyPawan KalyanSreeLeelaUstaad Bhagat SinghUstaad Bhagat Singh teaserVote For GlassYsrcp
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.