Varahi in Vizag : వారాహి విజయయాత్ర ఈ పేరు ఇప్పుడు ఒక ప్రభంజనం. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రలో ఎంతటి కుదుపుని తీసుకొచ్చిందో మన అందరికీ తెలుసు. ప్రజలలో పవన్ కళ్యాణ్ మమేకం అవ్వడం కోసం ప్రజల బాధలు తెలుసుకొని వాటి వెనకాల ఉన్న కారణాలు, వారి సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజలను కలవాలనే ఉద్దేశంతో ఆయనే ప్రజల మధ్యకు వెళ్లారు.
ఆ దశలోనే వారాహి యాత్రలో పెళ్లి బిక్కిన స్పందన పవన్ కళ్యాణ్ పార్టీకి రావడం జరిగింది. జనసేన ఊహించిన దానికంటే ప్రజల నుండి వారాహి యాత్రకు వచ్చినటువంటి స్పందన అమోఘం. అంత స్పందన వచ్చింది అంటేనే దాని వెనక ప్రజలకు ఎంత బాధ, సమస్య దాగి ఉన్నాయో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు వైసిపి ప్రభుత్వం పాలనలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు అనేది మనకు చెప్పకనే చెబుతుంది.
పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహియాత్ర తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నో ప్రజా సమస్యలను జనసేన అధినేత కళ్ళ ముందు ఉంచింది. వారి సమస్యలను తెలుసుకుంటూనే దాని పరిష్కార దిశగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించారు. కొన్ని సమస్యలకు రుజువులు చూపెట్టారు. కొన్ని సమస్యలను వెలిగెత్తి లోకానికి చాటారు. ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో వాస్తవానికి ఎవరికి తెలియదు. కానీ ఆ నిగూడ సత్యాలను వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు మన కళ్ళకు కట్టారు.
ఇప్పుడు దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నగరంలో అడుగుపెట్టనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రారంభం కాబోయే వైజాగ్ వారాహి విజయయాత్ర ఎలా ఉండబోతుందో అని అటు అధికార పక్షానికి ఇటు మిత్రపక్షలకు కూడా ఒక రకమైన ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఖచ్చితంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఏ విధంగా అయితే వారాహియాత్ర విజయ ప్రభంజనం మోగించిందో, అచ్చం అలాగే వైజాగ్ నగరంలో కూడా విజయ డంకా మోగిస్తుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికార ప్రభుత్వం పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని వారాహి యాత్రను ఆపివేయాలని నిగూడా సంకల్పంతో ఉందనేది అర్థమవుతుంది. ఎందుకంటే వారాహి యాత్ర మీద వారి విధిస్తున్నటువంటి ఆంక్షలు దానికి ప్రతిరూపం. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే వైజాగ్ చేరుకున్న పవన్ కళ్యాణ్ కి పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం జగదాంబ జంక్షన్ లో మొదలు కాబోతున్న ఈ యాత్ర ఎటువంటి ప్రకంపనలు తీసుకొస్తుందో, ఎటువంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో మనం వేచి చూడాల్సిందే.