Varahi Yatra is the Fourth Stage : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడుసార్లు వారాహి విజయ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి విజయ యాత్రను విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరల నాలుగో విడత వారాహి యాత్రను చేపట్టనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రారంభం కానున్న ఈ నాలుగో విడత విజయ యాత్ర గురించి వివరాలు, అలాగే యాత్ర ఏ రకంగా సాగుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర.. నాలుగో విడత త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ యాత్రను అక్టోబర్ 1 నుంచి పవన్ ప్రారంభించనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాలుగో విడత యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో నాదెండ్ల మనోహర్ ఇవాళ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర.. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.