Varun Tej Lavanya Tripathi Engagement : మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకపక్క కామెడీ, మరోపక్క మాస్, ఇంకా రొమాంటిక్ స్టోరీలు చేస్తూ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. గద్దల కొండ గణేష్ వంటి పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టు నీ అద్భుతంగా డీల్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అంతకుముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాలో సరికొత్త ప్రేమ కథ జోనర్ తో అదిరిపోయే విజయం అందుకున్నాడు.
వరుణ్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. అయితే వరుణ్ మూడు సంవత్సరాలుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో డేటింగ్ చేస్తున్నాడని వార్త వైరల్ అవుతూనే ఉంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు మిస్టర్, అంతరిక్షం సినిమాల్లోని కలిసిన నటించారు. అప్పట్లో ఏకంగా మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి అంటూ వార్తలు కూడా పుట్టుకొచ్చాయి.
ఇప్పటి వరకు దీనిపై ఇద్దరు ఎప్పుడు, ఎక్కడ స్పందించలేదు. కానీ పార్టీలు, ఫంక్షన్స్ కి కలిసి వెళ్లేవారు దీంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యేవి. అయితే తాజా సమాచారం ప్రకారం జూన్ 9న శుక్రవారం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరగనుంది. కుటుంబ సభ్యులు, కొంత మంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమం ఉంటుందని తెలిసింది. పెళ్లి ఎప్పుడనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రెసెంట్ వరుణ్ గాండీవధారి అర్జున మూవీలో నటిస్తున్నాడు.