Vijay Dalapati’s Political Entry : సినిమా హీరోల ఫ్యాన్స్ ఎవరైనా సరే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఎప్పుడు వివాదాల్లో ముందుంటారు. హీరోల మధ్య సఖ్యత ఉన్నా.. అభిమానులు మాత్రం ఈ విషయంపై ఎక్కడ తగ్గేది లేదు అంటూ వ్యవహరిస్తూ ఉంటారు.. తమిళనాడులో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు విజయ్ అభిమానులకూ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు వివాదాలు రగులుతూనే ఉంటాయి.
అయితే విజయ్ మాత్రం తన అభిమానులను ఉద్దేశించి “దయ చేసి ఓపిక పట్టండి.. మన లక్ష్యం వేరే ఉంది.. అది చాలా గొప్పది.. మనం ఆ దిశగా అడుగులు వేద్దాం.. భవిష్యత్తులో మనం ఏంటో చూపిద్దాం..” అంటూ వ్యాఖ్యలు చేశారు. లియో విజయోత్సవ వేడుకల్లో భాగంగా విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ పురుట్చి తలైవర్ ఒక్కరే.. (విప్లవ నాయకుడు MGR)
నడిగర్ తిలగం ఒక్కరే (శివాజీ గణేషన్) పురుట్చి కలైంజ్ఞర్ ఒక్కరే (కరుణానిధి) విశ్వ నటుడు ఒక్కరే (కమల్ హాసన్) సూపర్ స్టార్ ఒక్కరే (రజనీకాంత్) తల ఒక్కరే (అజిత్) ఇక దళపతి అంటారా నాకు సంబంధించిన వరకు దళపతి అంటే రాజుల ఆజ్ఞను పూర్తి చేసేవాడు. నాకు రాజులంటే మీరే, ప్రజలే మీరు చెప్పండి. నేను చేసి చూపిస్తాను.. అని వ్యాఖ్యలు చేశారు.. అంతే కాక 2026 లో ఫుట్బాల్ టోర్నీ జరగనుందని అందులో కప్పు సాధించడమే ముఖ్యమని ఇండైరెక్టు గా తన రాజకీయ ప్రవేశం పై చెప్పకనే చెప్పారు..
తన అభిమానులు ఉద్దేశిస్తూ ఎవరి మనసులను బాధించవద్దని, మనకు చాలా పెద్ద పని ఉంది పెద్ద లక్ష్యం పెట్టుకుని ఛేదించాలి ఏది అసాధ్యమో దానిని సాధించడమే విజయం. అహింస నిజమైన ఆయుధం అని పేర్కొన్నారు.. చూస్తుంటే విజయ్ త్వరలోనే రాజకీయాల వైపు అడుగులు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు నటుడు అర్జున్ కూడా అదే వేదికపై మాట్లాడుతూ హీరో విజయ్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వ్యాఖ్యలు చేశారు..