Vijay Thalapathy : తమిళ హీరో ‘తలపతి’ విజయ్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత.. ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోల్లో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటాడు. ప్రెసెంట్ విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ‘లియో’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను అలాగే నా రెడ్డి అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడిదే పాట విజయ్ దళపతిని చిక్కుల్లో పడేసింది.
విజయ్ ని మాత్రమే కాదు.. మొత్తం లియో టీంపై కేసు నమోదైంది. కారణమేంటంటే.. అందులో విజయ్ సిగరెట్ తాగుతున్నట్లు కనిపించడమే. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ చెన్నైకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ.సెల్వం కోర్టును ఆశ్రయించాడు. దీంతో దళపతితో పాటు.. చిత్రబృందంపై ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశాడు. వీరిపై నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని కోరాడు. విజయ్ సామాజికంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో తాజాగా తమిళనాడులో ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పాసైన తమిళ విద్యార్థులకు చేయూత ఇవ్వడానికి విజయ్ ముందుకొచ్చాడు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా తల్లిదండ్రులు పోత్సాహించాలని చెప్పే విజయ్.. ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ తాగుతూ నటించడం ఏం బాగోలేదని సదరు వ్యక్తి ఆరోపించాడు. ప్రెసెంట్ వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న లియో మూవీని అక్టోబర్ 19న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన సౌత్ క్వీన్ త్రిష నటిస్తుంది.