Women’s World Cup 2023:ఉమెన్స్ ప్రపంచ కప్…. విశ్వవిజేత ఆస్ట్రేలియా
అనుకున్నదే జరిగింది. హాట్ ఫేవరెట్ గా,టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లీగ్ నుండి మొదలు ఆఖరి సమరం వరకు అప్రతహిత విజయాలతో దూసుకెళుతూ ప్రపంచ కప్ ని ముద్దాడింది. ఇక మొదటి నుండి ఉన్న అనవాయితీ ప్రకారం ఫైనల్ ఫైట్ లో బోల్తా పడటం అలవాటు చేసుకున్న సఫారీలు తుది సమరంలో ఓడి తమ రికార్డుని మరింత పదిలం చేసుకున్నారు. వెరసి ఈరోజు జరిగిన T20 ఉమెన్స్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా,సౌత్ ఆఫ్రికా ఫై 19 పరుగులతో గెలిచి ఆరోసారి ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఫైనల్ ఫైట్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఇక 157 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓవర్లు అన్నీ ఆడి 137 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

సౌతాఫ్రికా బ్యాటర్లలో వోల్ వార్ట్ (61),ట్రయాన్(25)రాణించినా మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కట్, గార్డ్ నర్,బ్రౌన్,జొనాసెన్ తలో వికెట్ తీశారు.



