YS Viveka Murder Case:YS వివేకా హత్య కేసులో కీలక మలుపు…. రేపు అవినాష్ అరెస్ట్ తప్పదా???
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన YS వివేకా హత్య కేసులో ఈరోజు మరింత కీలక మలుపు తిరిగింది.హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ YS అవినాష్ రెడ్డి ఇవాళ తెలంగాణా హై కోర్ట్ లో, తనని CBI అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
CBI విచారణలో భాగంగా రేపు YS అవినాష్ రెడ్డి ని CBI విచారించనున్న నేపథ్యంలో ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రేపు CBI విచారణ అనంతరం అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అవినాష్ రెడ్డి పిటిషన్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు హై కోర్ట్. అలాగే న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని, విచారణ కూడా రికార్డ్ చేయాలని అవినాష్ కోర్ట్ కి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే కేసు తెలంగాణా కి బదిలీ అయినప్పటి నుండి వేగంగా దర్యాప్తు మొదలుపెట్టిన CBI, కేసుని త్వరగా ముగించేలా అన్ని ఆధారాలతో పక్కాగా ముందుకు వెళుతున్నట్టే అనిపిస్తుంది. చూడాలి మరి మున్ముందు వివేకా హత్య కేసులో ఏం జరుగుతుందో.