Ash Gourd : ప్రతి ఒక్కరు కుటుంబంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. సమస్యలు పరిష్కారం దొరకక వాటితో సతమతమవుతూ ఉంటారు. కానీ కొన్ని దీపారాధనల వల్ల సమస్యల నుంచి పరిష్కారం పొందవచ్చు అని ఆధ్యాత్మికవాదులు చెప్తున్నారు. ముఖ్యంగా దాంట్లో గుమ్మడికాయతో దీపారాధన చేయడం విశేష స్థానాన్ని కలిగి ఉంది. మనకున్నటువంటి దోషాలు పోవడానికి పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి నాడు అనగా కాలభైరవ స్వామికి చాలా ఇష్టమైనటువంటి ఆ రోజున కుష్మాండ దీపారాధన చేయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.
అలాగే నరఘోష ,ఆర్థిక సమస్యలు ,దృష్టి దోషం వంటి సమస్యలతో బాధపడే కుటుంబాలు వీటితోపాటు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఇంట్లో ప్రతికూల శక్తులు అధికంగా ఉండడం లాంటివి దీపారాధన చేయడం వల్ల తొలగిపోతాయని తెలియజేస్తున్నారు. అయితే ఈ దీపారాధన చేయాలనుకునేవారు ముఖ్యంగా బూడిద గుమ్మడికాయను ఈ దీపారాధనలో ఉపయోగించాలి. గుమ్మడికాయని కోసి,దానిలోని గుజ్జు తీసి, దానికి పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత నువ్వుల నూనె వేసి వెలిగించాలి.
బూడిద గుమ్మడికాయకి నమస్కారం చేసుకొని గ్రామ దేవత అయినటువంటి చండీమాతను, తల్లిదండ్రులను, గురువులుని తలచుకోవాలి. ఈ దీపారాధన వల్ల కుటుంబంలో నెలకొన్నటువంటి అశాంతి తొలగిపోయి, సౌభాగ్యం చేకూరి, కష్టాలన్నీ తగ్గుముఖం పడతాయి. అమావాస్యలో 19 అష్టమి తిధుల రోజుల్లో ఈ దీపారాధన చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఇంటికున్నటువంటి దిష్టి లేక బాధలతో సతమతమయ్యేవారు ఈ పూజ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఎండు ఖర్జూరాలని నైవేద్యంగా పెట్టి, ఆ రోజు ఉపవాసం చేస్తే ఇంకా చాలా మంచి ఫలితాలను చూడవచ్చు. భక్తి,శ్రద్ధలతో ఇలా దీపారాధన చేసి మీకున్నటువంటి దోషాలను తొలగించుకోండి.