Asthma During Diwali : దీపావళి పండుగ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ పండుగ నాడు అందరూ ఎంతో సంతోషంగా దీపాలు వెలిగించి బాణాసంచాను కాలుస్తారు. అయితే ఈ బాణాసంచా వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. బాణాసంచాలో ఉండే రసాయనాలు చాలా ప్రమాదకరమని చెప్పాలి. ముఖ్యంగా ఈ బాణసంచా వల్ల శ్వాస కోస వ్యాధులు ఉన్నవారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వీళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
★ శ్వాసకోశ వ్యాధులు ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
చాలామందిని ఉబ్బసం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ఒక దీర్ఘకాలిక శ్వాస కోసం పరిస్థితి. ఉబ్బసం ఉన్నవారికి ముఖ్యంగా ముక్కు ద్వారా గాలి ఊపిరితిత్తులకు చేరే మార్గం చాలా సున్నితంగా ఉంటుంది. కాలుష్య కారకాల వల్ల ఆ వాయు మార్గాలు ఇన్ఫ్లమేషన్కు కి గురై సంకోచించి ఇరుకుగా అవుతాయి. అలా అయినప్పుడు ఆస్తమాతో బాధపడేవారు ఊపిరి పీల్చుకోవడానికి కష్టమవుతుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
★ బాణసంచా కాల్చే ప్రదేశాలకు ఆస్తమా వ్యాధిగ్రస్తులు వెళ్లకపోవడం మంచిది. గాలి కాలుష్యం అధికంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉండడం ఉత్తమం.
★ బయటి బాణాసంచా పోగా ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులు అన్ని మూసి ఉంచడం మంచిది. బయట రసాయనాలతో నిండిన గాలి ఇంట్లో గాలిలో కూడా చేరే ప్రమాదం ఉంటుంది.
★ పండుగ రోజు ఎన్ 95 వంటి మాస్కులు ధరిస్తే సూక్ష్మజీవులు ముక్కుని చేరకుండా అడ్డుకుంటుంది. కాలుష్య కారకాలను ఫిల్టర్ చేస్తాయి. రసాయనాల గాలిని పీల్చుకుంటే మీకు ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
★ దీపావళి పండుగ రోజు ఇంట్లో దీపాలు పెట్టి పూజలు చేస్తారు. ఆ సమయంలో ధూపాలు ,వేయడం అగరబత్తులు వెలిగించడం లాంటివి చేస్తారు. వీటి నుండి వచ్చే పొగ కూడా ఆస్తమారోగులకు ఇబ్బందికరమే. కాబట్టి వీరు వాటికి దూరంగా ఉండి, మీ గది తలుపులు, కిటికీలు వేసి ఉంచుకోవడం మంచిది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీపావళి నాడు ఆస్తమా ఉన్నవారు రసాయన బాణ సంచా కాలుష్యం నుండి బయటపడవచ్చు.
.