Auto : మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఎదో ఒక వాహనం కావాలి. ఇప్పుడు ఎక్కువగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవి ఆటోలు..ఇప్పుడు ఇవి బయట ఒక్క మనిషికి 10 ఆటోలు అన్నట్లుగా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలా వాహనాలకి నాలుగుచక్రాలు ఉంటాయి. కానీ ఆటోలకు మాత్రం మూడు చక్రాలే ఉంటాయి.
మరీ ఆటోలకి మూడు చక్రాలే ఎందుకు ఉంటాయి. దాని వెనక కారణం ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా ? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు చక్రాలతో తయారు చేసిన వాహనాల కంటే మూడు చక్రాలతో తయారు చేసిన వాహనాలకు ఖర్చు చాలా తక్కువ అవుతుంది. అలాగే పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
దానివల్ల ఎటువంటి రోడ్లమీద అయినా, ఇరుకుగా ఉన్న రహదారుల్లో అయినా ఈ వాహనంతో ప్రయాణం చేయవచ్చు. మూడు చక్రాల వాహనం వల్ల ఇంధన ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుంది. మూడు చక్రాల వాహనాన్ని ఎక్కువగా ప్రయాణికులను తరలించేందుకు వినియోగిస్తూ ఉంటారు. కానీ ఏవైనా సరుకులను రవాణా చేయాలంటే ఈ వాహనం అంతగా ఉపయోగపడదు.
అలాంటి సందర్భాల్లో నాలుగు చక్రాల వాహనమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆటో అన్నివేళలా ఉపయోగపడదు. ఎలా అంటే.. మంచుతో కూడిన ప్రాంతాలలో లేదా కార్నరింగ్ ప్రదేశాలలో ఆటో డ్రైవ్ చేయడం కష్టం. అలాగే నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం తక్కువ సామర్థ్యం కలిగివుంటుంది. మూడు చక్రాలు కలిగిన ఆటోతో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి.