Beliefs : నమ్మకాలు అనేవి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి. ఎవరి నమ్మకం వారిది. మన భారతదేశంలో నమ్మకాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఎలా అయితే ఉంటాయో, ఇతర దేశాలలో కూడా అచ్చం ఇలాంటి నమ్మకాలే ఉన్నాయి. వారు ఇంత మోడ్రన్ సొసైటీలో కూడా ఇప్పటికీ వాటిని పాటించడం నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి.
మరి నమ్మకాలను పాటించే ఆ దేశం ఎక్కడో.. వారు ఏ నమ్మకాలను పాటిస్తారో.. ఇప్పుడు తెలుసుకుందాం. లాటిన్ అమెరికా దేశంలో ఇప్పటికి కూడా కొన్ని నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. ఆ దేశంలో మంగళవారం రోజు పెళ్లి చేసుకోవడం అమంగళంగా భావిస్తారు. ఒకవేళ మంగళవారం పెళ్లి చేసుకుంటే ఆ దంపతుల మధ్య ఎప్పుడు మనస్పర్ధలు వస్తూ ఉంటాయంట.
వారి మధ్య సాన్నిహిత్యం లోపిస్తుందని నమ్ముతారు. ఆ జంట విడాకుల వరకు వెళ్లినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని వారు విశ్వసిస్తారు. ఒకవేళ మంగళవారం రోజు ఎవరైనా పెళ్లి చేసుకున్నట్లయితే ఆ పెళ్ళికి వెళ్లకుండా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటారు..లాటిన్ అమెరికాలో ఇంకో వింత నమ్మకం కూడా చెలమణిలో ఉంది. వర్షం వచ్చినప్పుడు గొడుగు తీసుకుని బయటికి వెళ్లడం సహజంగా అందరు చేసే పని. కానీ ఇంట్లో గొడుగు తెరవడం లాటిన్ అమెరికా ప్రజలు దురదృష్టంగా భావిస్తారు.
వారు ఎప్పుడూ కూడా ఇంట్లో గొడుగును ఓపెన్ చేయరు. మేక మాంసం అంటే అందరికీ ఎంతో ఇష్టం ఉంటుంది. ఎవరైనా తినడానికి పెడితే దానిని మనం వద్దు అని అసలు చెప్పలేము. కానీ లాటిన్ అమెరికా దేశంలో మహిళలు మేక మాంసాన్ని దూరం పెడతారు. మేక మాంసాన్ని అధికంగా తీసుకుంటే వారి మొహం పైన వెంట్రుకలు వస్తాయని వారు నమ్ముతారు. కాబట్టి వీలైనంతవరకు మేక మాంసాన్ని వారు తినడానికి ఇష్టపడరు.