Breakfast : ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎన్ని వ్యాయామాలు చేసిన డైట్ లో మార్పులు చేసినా కూడా ఆ సమస్య నుంచి బయటపడడం కష్టతరంగానే ఉంటుంది. వ్యాయామం లేకుండా సరైన డైట్ ని ఫాలో అయితే ఈ బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. మరి అధిక బరువును ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం తీసుకునే అల్పాహారంలో మార్పులు చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలా తీసుకుంటే ఆకలి అదుపులో ఉండి స్వతహాగా బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. మరి ఆల్పాహారం లిస్ట్ ఏమిటో చూసేద్దాం.
పోహ : రుచికరమైన ఆహారాల్లో పోహా ఒకటి. దీంట్లో ఆరోగ్యానికి ఉపయోగపడే కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. దానివల్ల అధిక బరువు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. కూరగాయలను ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిది. అలాంటి సమయంలో ఆకలి తగ్గి, బరువు కూడా తగ్గడానికి సహాయం అవుతుంది.

ఓట్ మీల్ : ఓట్ మీల్ లో ప్రోటీన్ శాతం సమృద్ధిగా ఉంటుంది. ఉదయాన్నే ఓట్ మిల్ అల్పాహారంగా తీసుకుంటే మంచిది. అధిక బరువు సమస్య తగ్గించుకోవచ్చు. అలాగే ఓట్ మీల్ సులభంగా జీర్ణం అవుతుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. దానిద్వారా అధిక ఆహారాన్ని మీరు తీసుకోలేరు, కాబట్టి బరువు తగ్గడానికి ఓట్ మీల్ దోహదపడుతుంది.
ఉప్మా : ఉప్మాలో ప్రోటీన్ శాతం అధికం. ఇది త్వరగా జీర్ణం కూడా అవుతుంది. రవ్వ, కూరగాయలతో చేసే ఉప్మా ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గేవారికి ఉప్మా మంచి ఛాయిస్. ఉప్మా తినడం వల్ల ఆకలి కూడా అదుపులో ఉంటుంది.
ఇడ్లీ : తక్కువ క్యాలరీలు ఉండే ఇడ్లీని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే అధిక బరువు సమస్య తగ్గుతుంది. సులభంగా జీర్ణమయ్యే ఆహారంలో ఇడ్లీ కూడా ఒకటి.
