Chanakya Neeti : చాణక్యుడు వివాహ వ్యవస్థ గురించి, భార్యాభర్తలు ఉండవలసిన విధానం గురించి తన అధ్యయనాల్లో వెల్లడించారు. చాణక్య సూత్రాలు పాటిస్తే వారి జీవితం చాలా గొప్పగా, ఆనందమయంగా ఉంటుంది. ఎలాంటి క్లిష్ట సమస్యలైనా కూడా చాణక్యుడు తన నీతి సూత్రాలు ద్వారా సులభతరం చేసుకోవడానికి ఎన్నో విషయాలను మన కోసం తన రచనల్లో పొందుపరిచాడు.
చాణక్యుడు చెప్పిన ఎన్నో సూత్రాలలో భార్యాభర్తల వైవాహిక జీవితం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు. భార్యభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ సూత్రాలను గనుక పాటించినట్లయితే ఆ సమస్యలు తొలగిపోయి వారి జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఏ బంధమైనా వాటికి పునాది ప్రేమ, నమ్మకం ఈ ప్రేమా నమ్మకం లోపిస్తే ఎలాంటి బంధమైనా విచ్ఛిన్నం కాక తప్పదు.
అలాంటి బంధాన్ని నిలుపుకోవడానికి అలాంటి బంధాలలో ముఖ్యమైనది భార్య భర్తల బంధం. ఇది చాలా గట్టి బంధం ఈ బంధంలో గనక ప్రేమ,నమ్మకం లోపిస్తే ఆ బంధం బలహీనపడడం ఖాయం. కాబట్టి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలి అని అంటే.. మనం తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తల గురించి చాణక్యుడు ప్రస్తావించాడు.
ప్రేమా : భార్యాభర్తల మీద ఒకరికొకరు ప్రేమ పంచుకోవడంలో సిగ్గు పడకూడదు. పరస్పరహారం ప్రేమను పంచుకుంటేనే వారి బంధం గట్టిపడుతుంది. లేకపోతే ఆ బంధం లో దూరం, అడ్డంకి కలిగిస్తుంది. ఒకరి మీద ఒకరికి అంకితభావం, త్యాగం విషయంలో ఎటువంటి సంకోచాలు ఉండకూడదు. అవకాశం దొరికినప్పుడల్లా జీవితాన్ని ఆనందమయంగా గడపాలని చాణుక్యుడు తన నీతి సూత్రాలలో వివరించారు.
గౌరవం : ఒకరి మీద ఒకరికి గౌరవం వివాహ బంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో గౌరవం కూడా అదే మోతాదులో ముఖ్యం ఎందుకంటే భార్య భర్తలు ఎప్పుడు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ సూత్రం ఇద్దరికీ వర్తిస్తుంది. దీన్ని ఖచ్చితంగా పాటించినట్లయితే, వారి వైవాహిక జీవితం మనస్పర్ధలు లేకుండా సాగిపోతుంది. చాణక్య నీతి ప్రకారం పై అంశాలను అనుసరిస్తే వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది.