Chicken : చికెన్ అంటే ఇష్టం పడని వారు ఎవరూ ఉండరు. అధిక సంఖ్యలో చిన్నలు,పెద్దలు అత్యంత ప్రీతిగా తినేది చికెన్. అతిగా చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? లేక ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తుతాయా?. ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ అతిగా తినే వాళ్ళలో “యాంటీ మైక్రో బయల్ రెసిస్టెన్స్” అనే వ్యాధి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. పౌల్ట్రీ నుండి వస్తున్న చికెన్ అతిగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, డబ్ల్యుహెచ్ఓ కూడా ప్రత్యేక రిపోర్టును విడుదల చేశారు. అయితే ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా కూడా ఉందని డబ్ల్యూహెచ్ఓ
(WHO ) సంస్థ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అందరూ దాన్ని తినడానికి ఇష్ట పడతారు. కరోనా సమయంలో చికెన్ వినియోగం ఎక్కువగా పెరిగిరిపోయింది. అతిగా చికెన్ తినడం ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని డబ్ల్యుహెచ్ఓ రిపోర్టు లో తెలిపారు.
ఫామ్ లో పెరిగిన కోళ్లను ఎక్కువగా వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని నిపుణులు తెలుపుతున్నారు. కోళ్ల పౌల్ట్రీ( Poultry ) లో కోళ్ళు త్వరగా పెరగడానికి చికెన్ ఆరోగ్యంగా ఉంచడానికి అవసరానికి మించి యాంటీబయోటిక్స్ ను వేయడం వల్ల, కోళ్లకు వ్యాధులు సోకకుండా మందులను ఇస్తున్నారు. దానివల్ల కోళ్ళ శరీరం కెమికల్ గా మారిపోతుంది.
దానివల్ల కోళ్ల శరీరంలో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్ పేరుకు పోయి, ఈ రకమైన చికెన్ తిన్న వాళ్ళ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శరీరంలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరగడంతో రోగనిరోధక శక్తి( Immunity ) తగ్గిపోతుంది.దానివల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.