Dreem astrology : ప్రతి మనిషికి కలలు రావడం అనేది చాలా సహజం. కొందరికి ఒక్కోసారి ఆ కలలు గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. అయితే కలలను బట్టి కూడా మనకు మంచి జరుగుతుందా ? చెడు జరుగుతుందా? అని నిర్ణయించవచ్చు. ఈ కలలు రెండు రకాలుగా వస్తుంటాయి. ఒకరికి రాత్రి పూట వచ్చే కలలు, మరొకరికి పగటి కలలు.
అయితే కొందరికి కలలో పక్షులు, పాములు, జంతువులతో పాటు, పూర్వీకులు, మనం బాగా ఇష్టపడే వ్యక్తులు చనిపోతే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. చనిపోయిన వారు కలలో వచ్చి కనిపిస్తూ ఉంటే, అలా జరగడం మంచిదేనా ,కాదా అని చాలామంది భయపడుతూ ఉంటారు.
ఈ భయాలకు స్వస్తి చెప్తూ చనిపోయిన వాళ్లు కలలో కనిపిస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. మన పూర్వీకులు కలలో కనిపిస్తే వారి ఆశీస్సులు మనకు లభిస్తాయంట. పురాణాల్లో కూడా దీని గురించి ప్రస్తావించడం గమనార్హం. అగ్నిపురాణం, వాయు పురాణం గరుడ పురాణంలో దీని గురించి రాసి ఉంది.
ఆ సమయంలో చనిపోయిన వాళ్ల పేరు మీద కార్యక్రమాలు చేయడం వలన మంచి జరుగుతుందని చెప్తున్నారు. కొందరు కలలో పాములు వస్తే ఎం జరుగుతుందో అని కంగారు పడతారు. పాములు కనబడితే చనిపోయిన వారి ఆశీస్సులు బలంగా ఉన్నాయని అర్థం.
అందరూ చనిపోయిన వారికి కర్మలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో కనుక మనకు ధన లాభం వచ్చిన, మనం ఎప్పటినుంచో చేయలేని పనులు పూర్తయినా, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టినా కూడా అది కేవలం మన పూర్వీకుల ఆశీస్సులు అని మనం గమనించాలి.