Health Tips : ఆరోగ్యాన్ని పాడుచేసే వాటిల్లో ముఖ్యమైనది కొలెస్ట్రాల్ కూడా. కొలెస్ట్రాల్ నీ సరైన సమయంలో గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అవుతుంది. కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతుంది అంటే మనకు కొన్ని సంకేతాల ద్వారా అర్థమవుతుంది. దానితో మనం కొలెస్ట్రాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి.
మనం తినే ఆహార అలవాట్ల మీదనే గుండె వ్యాధులు ,మానసిక సమస్యలు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా ప్రమాదం. 25-35 సంవత్సరాల వయసులోనే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్రమత్తమై గుర్తించి చికిత్స తీసుకోవాలి.
చెడు కొలెస్ట్రానికి సంకేతాలు కళ్ళ పై పసుపు మచ్చ చారలు కనిపిస్తూ ఉంటాయి. రక్తంలో కొవ్వు పెరిగినప్పుడు ఈ విధమైన మార్పు మన శరీరంలో కనిపిస్తుంది. అలాగే మెడ, దవడ, కడుపు, వీపు భాగంలో నొప్పి వస్తే దాని అర్థం కొలెస్ట్రాల్ పెరిగింది అని. మానవ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సహిత రక్తం చేరనప్పుడు ఈ కొలెస్ట్రాల్ సమస్య వస్తుంది.
శరీరానికి చెమట ఎక్కువగా పట్టడం, చిరాకుగా అనిపించడం, చేతిలో తిమ్మిరి రావడం, లేదా అరచేతిలో చీమలు కుట్టినట్లుగా అనిపించడం, ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరిగాయి అని చెప్పడానికి సంకేతాలు. వీటన్నింటిని గుర్తించి వైద్యులను సంప్రదించకపోతే.. చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.