Health Tips : మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి . అలాంటి కొలెస్ట్రాల్ శాతం మన శరీరంలో పెరిగితే మనకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడం వల్ల హై బీపీ ,అలసట కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిన వాళ్ళు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాంటివాళ్లు మాంసాహారం తీసుకుంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వీళ్ళు ముఖ్యంగా చికెన్ ని తినకూడదు. చికెన్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. దాన్ని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని, సమస్యలు క్రమంగా పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిన వాళ్ళు, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. పాలల్లో ఫ్యాట్ ఉంటుంది. స్థూలకాయంతో బాధపడేవారు ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల ఆహార సమస్యలు పెరుగుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.