Interesting Fact about Bharla City : ఒక దేశంలో వంట చేస్తూ, మరో దేశంలో భోజనం చేసే వింతైన మనుషులను మీరు ఎప్పుడైనా చూసారా! అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు నెదర్లాండ్ లోనీ తమ వంటగదిలో వంట చేస్తూ, బెల్జియంలో భోజనం చేస్తారు. బెల్జియం, నెదర్లాండ్స్ సరిహద్దుల్లో భార్లే నగరం ఉంది. ఈ నగరానికి ఒక పోలీసు యూనిట్, పోస్ట్ హౌస్, టౌన్ హాల్ తో పాటు ఒక మేయర్ ఉన్నారు.
ఇక్కడి వారికి ఖాతాలు కూడా బెల్జియంలోనే ఉన్నాయి. అయితే వీటన్నింటిపై సమీకరించడానికి రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరిస్తుంది. అసలు దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం..
1918లో భూమిని అనేక భాగాలుగా విభజించినప్పుడు, ఇద్దరు రాజుల మధ్య ఒప్పందం కుదురుతుంది. ఆ తర్వాత భూమి చిన్న భాగాలుగా విభజించబడి, రెండు దేశాలుగా ఏర్పడింది. దాంట్లో భాగమే బార్లే నగరం. ఇక్కడ ఇంటి ప్రధాన ద్వారం ఏ దేశంలో అయితే ఉంటుందో ఆ ఇల్లు ఆ దేశానికి సంబంధించిందిగా పరిగణలోకి తీసుకుంటారు.
ఒకవేళ ఇంటిలోని సగభాగం మరో దేశం లో ఉంటే వీరు ఆస్తిపన్ను ఆదేశాన్ని కూడా చెల్లించవలసి ఉంటుంది. ఈ దేశాలలోని మేయర్లు, పోలీసులు, ప్రజలతో చాలా సామరస్యంగా, స్నేహభావంతో ఉంటారు. ప్రజలు కూడా వారికి తగ్గట్టుగా నడుచుకుంటారు. ఇక్కడి ప్రజలు తక్కువ ధర ఉన్న ఆహారాన్నీ కొనుగోలు చేయడానికి బెల్జియం అయినా నెదర్లాండ్ అయినా వెళ్తారు.
ఈ రెండు దేశాల్లోనూ మద్యపానం పైన కఠిన ఆంక్షలు ఉన్నాయి. బెల్జియంలో 16 , నెదర్లాండ్ లో 18 మద్యపానం సేవించడానికి నిర్ణయించిన వయసు. ఈ రెండు దేశాల్లో ఇతర చట్టాలు కూడా కాస్త భిన్నంగానే అమలు చేయబడతాయి.