Kitchen Tips : ఉరుకుల, పరుగుల జీవితంలో రోజు ఎంతో హడావిడిగా పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా పనులు కష్టతరం అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలకు మాత్రం ఇది ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించి వంట పనిని ఈజీగా చేసుకుంటూ సమయాన్ని ఆదా చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆ చిట్కాలు ఏమిటి.. అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
★ఒక్కోసారి మనం పెరుగు తోడేసి మర్చిపోతుంటాం. అలాంటప్పుడు పెరుగు పుల్లగా అయిపోతుంది. పెరుగు పుల్లగా కాకుండా ఉండాలంటే దాంట్లో కొబ్బరి ముక్కను వేయాలి.
★ ఎక్కువగా తెచ్చుకొని నిలువ చేసుకుంటే అవి ఏరుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే మిరపకాయలు నిల్వ చేసే సీసాలో కాసింత పసుపు వేసుకోవాలి.
★ వర్షాకాలంలో ఉప్పు నీరు లాగా ముద్దముద్దగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే ఆ జాడీలో రెండు పచ్చిమిరపకాయలను వేసి ఉంచాలి.
★ పెరుగు ఎక్కువ పులుపుగా ఉన్నట్లయితే దాంట్లో కాసిన్ని చల్లని పాలను కలిపితే పులుపు తగ్గిపోతుంది.
★ వెల్లుల్లి రేకులను ఈజీగా తీయడం కోసం వాటికి కాస్త నూనెను రాసుకొని ఎండలో ఆరబెట్టాలి అప్పుడు ఈజీగా ఓల్చుకోవచ్చు.
★ నిమ్మకాయ ముక్కలను రసం తీయగానే అందరూ పడేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఆ ముక్కలను సన్నని ముక్కలుగా కత్తిరించి ఆవిరి మీద వాటిని కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత ఆ ముక్కలకి కారం, బెల్లం, ఉప్పు కలిపి పోపు వేయాలి. కమ్మగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది.
★ దోసెలు పలుచగా రావాలంటే పిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం వేసి రుబ్బుకోవాలి. దోసెలు పల్చగా వస్తాయి. కొన్నిసార్లు దోశలు వేసినప్పుడు పెనానికి అతుక్కుపోతాయి. అలాంటప్పుడు వంకాయతో ముక్కలతో పెనం మీద రుద్దితే దోశలు అతుక్కుపోవు.