Kitchen Vastu Tips : ఇంటి నిర్మాణం మొత్తంలో వంటగదిది ప్రత్యేకమైన స్థానం. వంటగది సరైన దిశలో ఉంటేనే ఆ ఇల్లు అన్నపూర్ణగా విరాజిల్లుతుంది. వంటగదిలో ఎటువంటి తప్పులు జరిగినా ఆ ప్రభావం ఇంటి కుటుంబ సభ్యుల పైన పడుతుంది. అలాంటి వంటగదిని ఏ దిశలో నిర్మించుకోవాలి.. ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి..
వంటగది నిర్మాణంలో లోపాలు జరిగితే ఏలాంటి దోషాలు వస్తాయి.. ఎలాంటి సమస్యలు సంభవిస్తాయో.. చూద్దాం. వాస్తు శాస్త్ర ప్రకారం వంటగదిలో చేయకూడని పనులు ఏంటంటే..వంట గదిలో స్టౌను డోర్ ముందుగానీ, పక్కన గాని పెట్టకూడదు. అలాగే వంటగది ఎప్పుడు ఆగ్నేయ దిశలోని నిర్మించుకోవాలి. గదిలో వంట చేసేటప్పుడు మీ మొకాన్ని దక్షిణం వైపు ఉంచకూడదు.
అలా చేస్తే మీకు హాని జరుగుతుంది. వంటగదిలోని స్టవ్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రమైన స్టవ్ మీద వంట చేస్తే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం కలుగుతుంది. వంటగది మెట్ల కింద నిర్మించకూడదు. అలాగే బాత్రూం పక్కన కూడా నిర్మించవద్దు. ఇలా చేస్తే ఇంటిపైన ప్రతికూల శక్తుల ప్రభావం వుంటుంది.
అలాగే గదిలో నలుపు వస్తువులను ఎక్కువగా ఉపయోగించకూడదు. నలుపు ప్రతికూల శక్తికి చిహ్నం. వంట గదిలో డస్ట్ బిన్ సింక్ కింద పెట్టడం చాలామందికి అలవాటు. అలా అస్సలు చేయకూడదు. అలాగే ఫ్రిడ్జ్ కూడా ఆగ్నేయం, ఉత్తరం, పశ్చిమ దిశలో ఉండాలి. ఫ్రిజ్ డోర్ తూర్పు దిశకు ఓపెన్ చేసేటట్టుగా అమర్చుకోవాలి.
వీటితోపాటు చీపురు, అద్దం వంటగదిలో ఎప్పుడూ కూడా ఉంచరాదు. వాటి వల్ల వారి ఇంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు రావడమేకాక, ప్రతికూల శక్తులకు నెలవుగా మారతాయి. ఈ జాగ్రత్తలు తీసుకొని మీ వంటగదిలో మార్పులు, చేర్పులు ఇప్పుడే చేయండి.