Marriage : హిందూ సంప్రదాయం ప్రకారం, హిందూ వివాహ వ్యవస్థలో వివాహానికి చాలా ప్రత్యేకత ఉంది. పెళ్లిలో ప్రముఖంగా జిలకర్ర, బెల్లం వధూవరుల తల పైన ఉంచడం వెనక చాలా ప్రాముఖ్యత దాగి ఉంది. మన ముందు తరాల వారు వివాహం నిశ్చయమైనప్పటినుంచి వధూవరులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి వీలు ఉండేది కాదు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి పద్ధతులు మారుతూ వస్తున్నాయి.
ఈ రోజుల్లో ముందుగానే అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడాలు చేసేస్తున్నారు. హిందూ వివాహ వ్యవస్థలో ఉన్న సాంప్రదాయం ప్రకారం..పెళ్లిచూపులు జరిగి, పెళ్లి నిచ్చమైన తర్వాత పెళ్లి మండపంలో వధూవరుల మధ్యలో తెల్లని తెరను అడ్డంగా ఉంచుతారు. దానిమీద నుండి జిలకర్ర, బెల్లం తల మీద పెట్టే వరకు ఒకరు ముఖాలు ఒకరు చూసుకోవడం జరిగేది కాదు.
అసలు ఈ జీలకర్ర, బెల్లం వెనుక ఉన్న రహస్యం ఏమిటి తల మీద అవి పెట్టిన తర్వాతనే ఎందుకు వధూవరులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. వధూవరుల మధ్యలో తెల్లని తెరను అడ్డం ఉంచి జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత ఆ తెరను తొలగిస్తారు. తొలగించినప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.
అలా చూసుకోవడం వెనుక వధూవరుల స్పర్శ, చూపు రెండు కూడా శుభప్రదంగా ఉంటుందని ఈ నియమాన్ని మొదలుపెట్టారు. జీలకర్ర, బెల్లం ఈ రెండు వేరువేరు లక్షణాలు కలిగి ఉంటాయి. బెల్లం ఏలాంటి అవశేషాలను మిగుల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర మాత్రం తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండా అంటిపెట్టుకొని ఉండి దానిలోని సద్గుణాలను అందిస్తుంది.వివాహ బంధంతో ఒకరిలో ఒకరు కలిసిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోనీ..
ఒకరితో,ఒకరి సద్గుణాలని పంచుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఈ రెండు పద్ధతులను ఉపయోగిస్తారు. ముసలితనం రాకుండా చేసే గుణం జీలకర్ర కి ఉంటుంది. బెల్లం అమృతం తో సమానం అని పెద్దలు చెపుతారు. ఈ రెంటి కలయిక వల్ల నిత్యం యవ్వనంగా ఉండమని, కలకాలం నిత్యాయవ్వనంగా వర్ధిల్లమని పెద్దల ఆశీర్వచనాలతో నిండిందే ఈ జీలకర్ర,బెల్లం వెనుక దాగిన రహస్యం.